Bobbarla Vadalu : బొబ్బ‌ర్ల వ‌డ‌ల‌ను ఇలా చేస్తే.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతాయి..!

Bobbarla Vadalu : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో బొబ్బ‌ర్లు కూడా ఒక‌టి. బొబ్బ‌ర్లల్లో అనేక పోష‌కాలు దాగి ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. బొబ్బ‌ర్ల‌ను ఎక్కువ‌గా గుగ్గిళ్లుగా చేసుకుని లేదా కూర‌గా వండుకుని తింటూ ఉంటాం. ఇవే కాకుండా బొబ్బ‌ర్ల‌తో వ‌డ‌లు కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. బొబ్బ‌ర్ల‌తో చేసే వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. లోప‌ల మెత్త‌గా పైన క‌ర‌క‌ర‌లాడుతూ ఈ వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే బొబ్బ‌ర్ల వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బొబ్బ‌ర్ల వ‌డ‌లు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బొబ్బ‌ర్లు – అర‌కిలో, త‌రిగిన ఉల్లిపాయలు – 2, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Bobbarla Vadalu recipe in telugu very tastye easy to cook
Bobbarla Vadalu

బొబ్బ‌ర్ల వ‌డ‌లు త‌యారీ విధానం..

ముందుగా బొబ్బ‌ర్ల‌ను శుభ్రంగా క‌డుక్కోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి 6 గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత వీటిలో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక త‌గినంత పిండిని తీసుకుని ప్లాస్టిక్ క‌వ‌ర్ మీద లేదా అర‌టి ఆకు మీద వ‌డ‌లు వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బొబ్బ‌ర్ల వ‌డ‌లు త‌యార‌వుతాయి. వీటిని చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. బొబ్బ‌ర్ల‌ను ఉడికించి తిన‌డంతో పాటు వాటితో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ వ‌డ‌ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి ఈ వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి.

D

Recent Posts