Multani Mitti Face Pack : ప్రతి ఒక్కరు కూడా, అందంగా ఉండాలని అనుకుంటుంటారు. అందంగా ఉండాలని, రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. ఖరీదైన ప్రొడక్ట్స్ ని కూడా, చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. ముఖం అందంగా, కాంతివంతంగా మారాలంటే, బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరగక్కర్లేదు. ఎక్కువ డబ్బులు ఖర్చు చేయక్కర్లేదు. మన ఇంట్లో సహజసిద్ధంగా దొరికే, కొన్ని వస్తువుల్ని ఉపయోగించి, ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. తెల్లగా కాంతివంతంగా మెరిసేటట్టు చేసుకోవచ్చు. అందాన్ని పెంపొందించుకోవడానికి, ఒక బౌల్ తీసుకుని, రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి అందులో వేసుకోండి. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది, చర్మాన్ని అందంగా మార్చగలదు.
అలానే, అలోవెరా జెల్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఆల్మండ్ ఆయిల్ ని కూడా మీరు అందాన్ని పెంపొందించుకోవడానికి వాడొచ్చు. ముందు ముల్తానీ మట్టిలో కొంచెం అలోవెరా జెల్ ఆ తర్వాత అందులోనే ఆల్మండ్ ఆయిల్ రెండు చుక్కలు వేసుకోండి. అంతా బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిని ముఖానికి పట్టించండి. ఐదు నిమిషాల వరకు అలా వదిలేసి, తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోండి.
ఈ విధంగా మీరు వారానికి రెండుసార్లు చేసినట్లయితే, ముఖం చాలా అందంగా మారుతుంది. నల్లని మచ్చలు వంటివి కూడా తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. తెల్లగా ఉంటుంది. ముఖ సంరక్షణని మెరుగుపరచడానికి ఈ పదార్థాలన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయి.
చర్మం పొడిగా లేకుండా, తేమగా ఉండేటట్టు కూడా ఇది చూస్తుంది. సో అందాన్ని పెంపొందించుకోవడానికి మీరు ఈ చిట్కాలని పాటిస్తే, అందంగా మారొచ్చు. మరింత మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ పదార్థాలు మనకి దొరికేవే. ఈజీగా మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ ధర కూడా ఏమి అయిపోదు. ముఖం కాంతివంతంగా అందంగా మారాలంటే ఈ చిన్న చిట్కాని ట్రై చేస్తే సరిపోతుంది.