Mustard Oil And Bay Leaves : కీళ్ల నొప్పులు అధికంగా ఉన్నాయా.. ఇలా చేయండి చాలు.. లేచి ప‌రుగెడ‌తారు..!

Mustard Oil And Bay Leaves : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కీళ్ల నొప్పుల స‌మ‌స్య కూడా ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ స‌మ‌స్య ప్ర‌స్తుత కాలంలో మ‌నంద‌రిని వేధిస్తుంది. పూర్వ‌కాలంలో పెద్ద‌వారిలో మాత్ర‌మే క‌నిపించే ఈ స‌మ‌స్యను యువ‌త‌లో కూడా మ‌నం ఇప్పుడు చూడ‌వ‌చ్చు. అధిక బ‌రువు, పోష‌కాహార లోపం, ముఖ్యంగా క్యాల్షియం లోపించ‌డం, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం , వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత కీళ్ల నొప్పులు వ‌స్తున్నాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల వ‌ల్ల క‌లిగే బాధ అంతా ఇంతా కాదు. ఈ నొప్పుల కార‌ణంగా క‌నీసం వారి ప‌నిని కూడా వారు చేసుకోలేక‌పోతుంటారు. స‌రిగ్గా న‌డ‌వ‌లేక‌ కూర్చోలేక అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు.

అలాగే నొప్పుల కార‌ణంగా నిద్ర కూడా స‌రిగ్గా ప‌ట్ట‌దు. చాలా మంది కీళ్ల నొప్పుల నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి పెయిన్ కిల్ల‌ర్ ల‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు. వీటి వల్ల ఫ‌లితం ఉన్న‌ప్ప‌టికి వీటిని దీర్ఘ‌కాలం పాటు వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఈ కీళ్ల నొప్పుల‌ను కేవ‌లం రెండే రెండు ప‌దార్థాల‌ను ఉప‌యోగించి స‌హ‌జ‌సిద్దంగా మ‌నం త‌గ్గించుకోవ‌చ్చు. కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించే ఆ రెండు ప‌దార్థాలు ఏమిటి…అలాగే వీటిని ఎలా ఉప‌యోగించాలి..అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించడంలో ఆవ నూనె మ‌రియు బిర్యానీ ఆకు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డతాయి. ఆవ‌నూనెలో ఉండే ఔష‌ధ గుణాలు నొప్పిని త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే బిర్యానీ ఆకును మ‌నం ఎక్కువ‌గా వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం.

Mustard Oil And Bay Leaves can reduce knee pain how to use it
Mustard Oil And Bay Leaves

బిర్యానీ ఆకులో కూడా ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. వీటిలో యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి నొప్పుల‌ను, వాపుల‌ను త‌గ్గించ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఆవ‌నూనెతో, బిర్యానీ ఆకుల‌తో ఔషధాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 50 ఎమ్ ఎల్ ఆవ నూనెను తీసుకుని వేడి చేయాలి. ఇందులోనే 5 బిర్యానీ ఆకుల‌ను ముక్క‌లుగా చేసి వేసుకోవాలి. ఈ ఆకుల‌ను ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు చిన్న మంట‌పై వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ నూనెను వ‌డ‌క‌ట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న నూనెను కీళ్ల నొప్పులు ఉన్న చోట రాస్తూ నూనె చ‌ర్మంలోకి ఇంకేలా సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. రాత్రి ప‌డుకునే ముందు ఈ నూనెను రాసుకుని ఉద‌యాన్నే క‌డిగి వేయాలి. కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts