Mustard Oil Cake For Hair : ఇది ఎక్క‌డ క‌పించినా విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి.. జుట్టు వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..

Mustard Oil Cake For Hair : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది జుట్టు రాలిపోవ‌డం అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. త‌ల‌స్నానం చేసినప్పుడు, దువ్వుకున్న‌ప్పుడు జుట్టు ఎక్కువ‌గా రాలిపోతూ ఉంటుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రిని ఈ స‌మ‌స్య వేధిస్తుంది. పోషకాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, ఒత్తిడి, ఆందోళ‌న‌, ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపుల‌ను, హెయిర్ కండీష్ న‌ర్ ల‌ను వాడ‌డం వంటి వివిధ కార‌ణాల చేత జుట్టు ఎక్కువ‌గా రాలిపోతూ ఉంటుంది. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. ర‌క‌ర‌కాల నూనెల‌ను వాడుతూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి ఎటువంటి ఫ‌లితం ఉండ‌దు.

చాలా త‌క్కువ ఖ‌ర్చుతో త‌క్కువ శ్ర‌మ‌తో ఒక చ‌క్క‌టి చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా స‌లుభంగా జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించే ఈ చిట్కా ఏమిటి.. అలాగే దీనిని త‌యారు చేసుకోవ‌డానికి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… ఎలా వాడాలి…అన్న త‌దిత‌ర విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంలో మ‌న‌కు ఆవ తెల‌గ పిండి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆవాల నుండి నూనె తీయ‌గా మిగిలిన పిండిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము, ఒక టీ స్పూన్ మెంతులు, ఒక గ్లాస్ నీళ్లు పోసి ఈ నీటిని వేడి చేయాలి. నీళ్లు బాగా మ‌రిగిన త‌రువాత అందులో రెండు రెమ్మ‌ల క‌రివేపాకును వేసి మ‌రిగించాలి. ఈ నీటిని అర గ్లాస్ అయ్యే వ‌ర‌కు బాగా మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

Mustard Oil Cake For Hair how to use it must know
Mustard Oil Cake For Hair

తరువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి ఒక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత ఒక గిన్నెలో మ‌న జుట్టుకు త‌గినంత ఆవ తెల‌గ పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ముందుగా త‌యారు చేసుకున్న నీటిని పోస్తూ పేస్ట్ లా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివ‌రి వ‌ర‌కు ప‌ట్టించాలి. త‌రువాత ఈ మిశ్ర‌మం పూర్తిగా ఆరిన త‌రువాత ర‌సాయ‌నాలు త‌క్కువ‌గా ఉండే షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌న జుట్టు పెరుగుద‌ల‌లో వ‌చ్చిన మార్పును మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. వివిధ కార‌ణాల చేత జుట్టు రాలుతున్న వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా పెర‌గ‌డంతో పాటు జుట్టు ప‌ట్టులా మృదువుగా కూడా త‌యార‌వుతుంది.

D

Recent Posts