చిట్కాలు

జలుబు, గొంతునొప్పి, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌ల‌కు ఎఫెక్టివ్ టిప్స్ ఇవి..!

చిన్న చిన్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా ఇంగ్లిష్ మెడిసిన్ త‌ర‌చూ వాడ‌డం వల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో అందరికీ తెలిసిందే. ఆయా మెడిసిన్స్‌ను ఎప్పుడూ వాడుతూ ఉంటే వాటి వ‌ల్ల క‌లిగే సైడ్ ఎఫెక్ట్స్‌తో ఇత‌ర అనేక దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. దీంతో కొండ నాలుక‌కు మందేస్తే ఉన్న నాలుక ఊడింద‌న్న చందంగా మ‌న ప‌రిస్థితి త‌యార‌వుతుంది. అయితే అలా కాకుండా ఉండాలంటే అలాంటి అనారోగ్యాల‌కు ఇంగ్లిష్ మెడిసిన్ కాకుండా స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో త‌యారు చేసిన మెడిసిన్‌ను వాడాలి. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు. పైగా ఎలాంటి అనారోగ్యాన్న‌యినా ఇట్టే త‌గ్గించుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. న‌ల్ల మిరియాలు, దాల్చిన చెక్క‌, జీల‌క‌ర్ర‌, యాల‌కుల‌ను స‌మాన భాగాల్లో తీసుకుని వాటిని క‌లిపి మిక్సీలో పొడిలా ప‌ట్టుకోవాలి. అనంతరం ఆ పొడిని వాస‌న పీలుస్తూ ఉండాలి. ఇలా చేస్తే జ‌లుబు, ముక్కు కార‌డం వంటివి త‌గ్గిపోతాయి.

ఒక టేబుల్ స్పూన్ నిమ్మ‌ర‌సం, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడి, ఒక టీస్పూన్ స‌ముద్ర‌పు ఉప్పుల‌ను ఒక గ్లాస్ వేడి నీటిలో బాగా క‌లిపి ఆ నీటిని పుక్కిలిస్తూ ఉండాలి. దీంతో గొంతు స‌మ‌స్య‌లు పోతాయి. ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వేసి బాగా క‌ల‌పాలి. అనంత‌రం ఆ నీటిని ప్ర‌తి భోజ‌నానికి ముందు నోట్లో వేసుకుని బాగా పుక్కిలించాలి. ఇలా చేస్తే నోటిలో పుండ్లు పోతాయి. నిమ్మ‌ర‌సం, న‌ల్ల మిరియాల పొడిని బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. దీన్ని ఆలివ్ ఆయిల్‌తో క‌లిపి తింటుంటే గాల్ స్టోన్స్ పోతాయి. దాని వ‌ల్ల వ‌చ్చే నొప్పి కూడా తగ్గుతుంది. 1/4 టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల నిమ్మ‌ర‌సం, 1 టేబుల్ స్పూన తేనెల‌ను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో బాగా క‌లిపి ఆ నీటిని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. దీంతో శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. ఇది అధిక బ‌రువును ఇట్టే త‌గ్గిస్తుంది.

natural home remedies for some common health problems

ఏదైనా కార‌ణం వ‌ల్ల ముక్కు నుంచి ర‌క్తం కారుతుంటే అందుకు నిమ్మ‌ర‌సం బాగా ప‌నిచేస్తుంది. ఒక కాట‌న్ బాల్‌ను నిమ్మ‌ర‌సంలో ముంచి దాన్ని ముక్కులో పెట్టుకోవాలి. అయితే అలా చేసే స‌మ‌యంలో త‌ల‌ను కొద్దిగా ముందుకు వంచాలి. దీంతో ముక్కు నుంచి కారే ర‌క్తం ఆగుతుంది. 1/2 టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడి, అంతే మోతాదులో ల‌వంగ నూనెలను తీసుకుని బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. దీన్ని నొప్పి ఉన్న దంతాల‌పై రాయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే ఫ‌లితం ఉంటుంది. అయితే ఈ ఔష‌ధం వాడితే కొద్ది రోజుల వ‌ర‌కు చ‌క్కెర‌, దాని స‌హాయంతో చేసిన ప‌దార్థాల‌ను తిన‌కూడ‌దు. న‌ల్ల మిరియాలు కొన్ని, 2 ల‌వంగాలు, 15 తుల‌సి ఆకులు తీసుకుని వాటిని ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో వేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంత‌రం మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టి వ‌చ్చే ద్ర‌వాన్ని జార్‌లోకి తీసుకోవాలి. దాన్ని చ‌ల్లార్చి అందులో కొంత తేనె క‌లుపుకుని తీసుకుంటుంటే ఆస్త‌మా త‌గ్గుతుంది.

ఒక క‌ప్పు మ‌రుగుతున్న నీటిలో ఒక నిమ్మ‌కాయ‌ను పిండి అనంత‌రం ఆ తొక్క‌ను కూడా అందులో వేయాలి. దాన్ని 10 నిమిషాల ఉంచాక తీసేయాలి. అనంత‌రం ఆ నీటిలో 1 టీస్పూన్ తేనె క‌లిపి తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం త‌గ్గుతాయి. క‌డుపు అంతా ఉబ్బ‌రంగా అదోలా ఉండి, వికారంగా ఉంటే న‌ల్ల మిరియాల పొడి, నిమ్మ‌ర‌సం ను తీసుకుని వాటిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వేసి బాగా క‌ల‌పాలి. అనంత‌రం ఆ నీటిని కొద్ది కొద్దిగా తాగుతుంటే వికారం త‌గ్గుతుంది.

Admin

Recent Posts