Oil For Hair Growth : మన ఇంట్లో పదార్థాలతో నూనెను తయారు చేసుకుని జుట్టుకు రాసుకోవడం వల్ల పలుచగా మారిన జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. మన జుట్టుకు ఎంతో మేలు చేసే ఈ నూనెను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో 100 ఎమ్ ఎల్ కొబ్బరి నూనెను తీసుకోవాలి. తరువాత ఈ నూనెను చిన్న మంటపై వేడి చేయాలి. తరువాత ఇందులో 2 టీ స్పూన్ల మెంతులు వేసి వేడి చేయాలి. తరువాత రెండు రెమ్మల కరివేపాకును వేసి వేడి చేయాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ ఆముదం నూనెను వేసి కలపాలి. ఈ నూనెను చిన్న మంటపై కలుపుతూ వేడి చేయాలి.
మెంతులు, కరివేపాకులో ఉండే పోషకాలు నూనెలో కలిసి నూనె రంగు మారే వరకు వేడి చేసి ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నూనెను చల్లారే వరకు అలాగే ఉంచి ఆ తరువాత వడకట్టుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను మనం రెండు నెలల పాటు ఉపయోగించుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు పట్టించాలి. ఈ నూనెను రాసుకున్న మరుసటి రోజూ తలస్నానం చేయాలి. ఈ నూనెను రోజంతా జుట్టుకు ఉంచుకోవడం కుదరని వారు రాత్రి పడుకునే ముందు ఈ నూనెను రాసుకుని ఉదయాన్నే కడిగి వేయాలి. ఇలా వారినికి రెండు సార్లు చేయడం వల్ల జట్టు రాలడం తగ్గుతుంది. ఈ నూనెను ఉపయోగించడం వల్ల జుట్టుకు కావల్సిన పోషకాలన్నీ అందుతాయి.
జుట్టు కుదుళ్లు బలంగా, ధృడంగా తయారవుతాయి. ఈ నూనెను ఉపయోగించడం వల్ల చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టు రాలడం, జుట్టు బలహీనంగా మారడం, చుండ్రు, తెల్ల జుట్టు వంటి సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా జుట్టును ఒత్తుగా, నల్లగా, పొడవుగా మార్చుకోవచ్చు.