Onion Juice : ఉల్లిపాయ‌ల‌తో ఇలా చేస్తే ఊడిన జుట్టు స్థానంలో తిరిగి జుట్టు వ‌స్తుంది..!

Onion Juice : నేటి త‌రుణంలో అందంగా ఉండ‌డం కోసం ప్ర‌తి ఒక్క‌రూ వివిధ ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంబిస్తున్నారు. స్త్రీలే కాదు, పురుషులు కూడా త‌మ అందాన్ని పెంచుకోవ‌డం కోసం ప్ర‌యత్నిస్తున్నారు. అయితే అందం విష‌యానికి వ‌స్తే ముఖంతోపాటు ప్ర‌ధానంగా చెప్పుకోద‌గిన‌వి శిరోజాలు. శిరోజాలు కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఎవ‌రైనా వాటిని చూసి ఆక‌ర్షింప‌బ‌డ‌తారు. ఈ క్ర‌మంలో ఒత్తైన జుట్టు కోసం ఉల్లిపాయ ర‌సం బాగా ప‌నిచేస్తుంది. ఉల్లిపాయ ర‌సంతో వెంట్రుకల‌కు పోష‌ణ‌ను ఎలా అందించ‌వ‌చ్చో ఇప్పుడు చూద్దాం.

కొన్ని ఉల్లిపాయ‌ల‌ను తీసుకుని వాటిని మెత్త‌ని పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ను త‌ల కుదుళ్ల‌కు త‌గిలేలా రాయాలి. బాగా మ‌ర్ద‌నా చేసిన అనంత‌రం ఒక గంట సేపు అయ్యాక త‌ల‌స్నానం చేయాలి. ఇలా త‌ర‌చూ చేస్తుంటే త‌ల‌పై ఊడిపోయిన వెంట్రుక‌లు మ‌ళ్లీ పెరుగుతాయి. అంతేకాదు వెంట్రుక‌లు దృఢంగా, ఒత్తుగా ఉంటాయి. ఉల్లిపాయ‌ల్లో ఉండే సల్ఫ‌ర్ అనే మూల‌కం జుట్టు పెరుగుద‌ల‌కు తోడ్ప‌డుతుంది.

Onion Juice can help get rid of hair problems
Onion Juice

ఉల్లిపాయ‌ల‌ను బాగా దంచి ఆ మిశ్ర‌మంలో కొద్దిగా కొబ్బ‌రి నూనె లేదా ఇత‌ర ఏవైనా ఆయిల్స్‌ను క‌లిపి రాసుకోవాలి. త‌రువాత 30 నిమిషాలు ఆగి త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే శిరోజాలు బాగా పెరుగుతాయి. కుదుళ్లు దృఢ‌మై వెంట్రుక‌లు ఆరోగ్యాన్ని, కాంతిని సంత‌రించుకుంటాయి. అలాగే ఉల్లిపాయ‌లను మెత్త‌గా దంచి వాటి నుంచి తీసిన ర‌సంలో కొద్దిగా తేనె, నిమ్మ‌ర‌సం క‌లపాలి. ఆ మిశ్ర‌మాన్ని కుదుళ్ల‌కు త‌గిలేలా ప‌ట్టించాలి. అనంత‌రం 30 నిమిషాల పాటు వేచి ఉండాలి. త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. రెగ్యుల‌ర్‌గా ఈ టిప్‌ను పాటిస్తే చుండ్రు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. శిరోజాలు కూడా కాంతివంత‌మ‌వుతాయి. ఈ చిట్కాల‌ను కేవ‌లం స్త్రీలే కాదు, పురుషులు కూడా పాటింవ‌చ్చు. దీంతో జుట్టు స‌మ‌స్య‌లు అన్నీ త‌గ్గుతాయి. అలాగే ఊడిన జుట్టు స్థానంలో మ‌ళ్లీ శిరోజాలు వ‌స్తాయి. దీంతోపాటు శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

Share
Editor

Recent Posts