Onions : ప్రస్తుత కాలంలో చాలా మంది సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఇలా సంతాన లేమి సమస్యలతో బాధపడాల్సి వస్తోంది. సంతాన లేమికి కారణాలు స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఉంటాయి. అండాశయాలు, గర్భాశయాలలో వచ్చే సమస్యలను స్త్రీలలో సంతాన లేమికి కారణాలుగా చెప్పవచ్చు. వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండడం, వీర్య కణాలు నాణ్యత తక్కువగా ఉండడం, శీఘ్రస్కలనం వంటి వాటిని మనం పురుషుల్లో సంతాన లేమికి కారణాలుగా చెప్పవచ్చు. శరీరంలో అధిక వేడి కూడా పురుషుల్లో ఈ సమస్యలు రావడానికి కారణం అవుతుంటుంది.
పురుషుల్లో వచ్చే ఈ సంతాన లేమి సమస్యలను మనం వంటింట్లో వాడే ఉల్లిపాయను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. మనం వంటల తయారీలో ఉపయోగించే వాటిల్లో ఉల్లిపాయ కూడా ఒకటి. ఇవి ప్రతి ఒక్కరి వంటగదిలోనూ ఉంటాయి. ఉల్లిపాయలను వేయనిదే చాలా మందికి వంట చేసినట్టుగా ఉండదు. ప్రతి వంటలోనూ మనం విరివిరిగా ఉల్లిపాయలను ఉపయోగిస్తూ ఉంటాం. ఉల్లిపాయలను ఉపయోగించడం వల్ల మనం చేసే వంటల రుచి పెరగడమే కాకుండా శరీరానికి కూడా మేలు కలుగుతుంది. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత మనకు చాలా కాలం నుండి వాడుకలో ఉంది.
ఉల్లిపాయను ఉపయోగించడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. పురుషుల్లో వచ్చే ఈ సంతాన లేమి సమస్యలను.. ఉల్లిపాయలను ఉపయోగించి ఎలా నయం చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మనం 20 గ్రాముల ఉల్లిపాయ ముక్కలను 20 గ్రాముల ఆవు నెయ్యిలో వేసి ఉడికించాలి. ఇవి ఉడికిన తరువాత వాటిలో 20 గ్రాముల పటిక బెల్లం పొడిని కలిపి ప్రతిరోజూ ఉదయం తింటూ ఉంటే శరీరంలో వేడి తగ్గి పురుషుల్లో వీర్య వృద్ధి కలుగుతుంది. వీర్య కణాల నాణ్యత పెరుగుతుంది. శీఘ్రస్కలనం సమస్య తగ్గి శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనవచ్చు. దీంతోపాటు సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. ఇలా ఉల్లిపాయలను ఉపయోగించి పురుషులు తమకు వచ్చే శృంగార పరమైన సమస్యలను నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.