Phool Makhana For Joint Pains : దీన్ని రోజూ తాగితే.. కీళ్ల నొప్పులు అస‌లు ఉండ‌వు..!

Phool Makhana For Joint Pains : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది కీళ్ల నొప్పులు, నీర‌సం, నిస్స‌త్తువ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల శ‌రీరం బ‌ల‌హీనంగా త‌యార‌వుతుంది. దీంతో రోజు వారి ప‌నులు చేసుకోలేక ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. చాలా మంది ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికి మల్టీ విట‌మిన్ క్యాప్సుల్స్ ను, అలాగే నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌డానికి పెయిన్ కిల్ల‌ర్ ల‌ను వాడుతూ ఉంటాం. కానీ మందులు వాడే అవ‌స‌రం లేకుండా మ‌న ఇంట్లోనే ఒక మిశ్ర‌మాన్ని త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా కీళ్ల నొప్పులు, నీర‌సం, నిస్స‌త్తువ వంటి స‌మస్య‌ల‌ను అధిగ‌మించ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

మ‌న‌కు వ‌చ్చే వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఈ మిశ్ర‌మాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిశ్ర‌మాన్ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఒక గ్లాస్ పాల‌ను, ఒక టీ స్పూన్ గ‌స‌గ‌సాల‌ను, ఒక క‌ప్పు ఫూల్ మ‌ఖనీని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఒక గిన్నెలో పాలు, గ‌స‌గ‌సాలు, ఫూల్ మ‌ఖనీ వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ పాల‌ను ముప్పావు గ్లాస్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో రుచి కోసం ప‌టిక బెల్లాన్ని కూడా క‌లుపుకోవ‌చ్చు. అయితే షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ప‌టిక బెల్లాన్ని ఉప‌యోగించ‌క‌పోవ‌డ‌మే మంచిది. ఇలా తయారు చేసుకున్న పాల‌ను తాగుతూ ఫూల్ మ‌ఖనీని, గ‌స‌గ‌సాల‌ను తినాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత క్యాల్షియం ల‌భిస్తుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి.

Phool Makhana For Joint Pains know how to take it daily
Phool Makhana For Joint Pains

ర‌క్త‌హీన‌త స‌మ‌స్య రాకుండా ఉంటుంది. నీర‌సం, నిస్స‌త్తువ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోగలుగుతారు. ఈ మిశ్ర‌మాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి కూడా ఈ మిశ్ర‌మం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ విధంగా పాల‌ను, ఫూల్ మ‌ఖ‌నాను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌కుండా య‌వ్వ‌నంగా క‌న‌బ‌డుతుంది. ఈవిధంగా మ‌న ఇంట్లోనే ఈ మిశ్ర‌మాన్ని త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వల్ల అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అలాగే ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వల్ల పోష‌కాహార లోపం కూడా త‌లెత్త‌కుండా ఉంటుంద‌ని వారు చెబుతున్నారు.

D

Recent Posts