Hotel Style Sambar Idli : హోట‌ల్ స్టైల్‌లో సాంబార్ ఇడ్లీని తినాల‌ని ఉందా.. అయితే ఇలా చేయండి..!

Hotel Style Sambar Idli : మ‌నం త‌ర‌చుగా ఇడ్లీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇడ్లీల‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఇడ్లీల‌ను తిన‌డానికి మ‌నం చ‌ట్నీతో పాటు సాంబార్ ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. సాంబార్ రుచిగా ఉంటేనే ఇడ్లీలు రుచిగా ఉంటాయి. మ‌న‌కు బ‌య‌ట హోటల్ లో కూడా ఇడ్లీ సాంబార్ విరివిరిగా ల‌భిస్తూ ఉంటుంది. బ‌య‌ట హోట‌ల్స్ లో ల‌భించే విధంగా రుచిగా, చిక్క‌గా ఉండే సాంబార్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. హోటల్ లో ల‌భించే విధంగా రుచిగా సాంబార్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

హోట‌ల్ స్టైల్ ఇడ్లీ సాంబార్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కందిపప్పు – 150 గ్రా., త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన ట‌మాటాలు – 2, బెల్లం – ఒక చిన్న ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, నాన‌బెట్టిన చింత‌పండు – నిమ్మ‌కాయంత‌, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – పావు టీ స్పూన్, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క – 1 ( చిన్న‌ది), క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్.

Hotel Style Sambar Idli recipe in telugu how to make this
Hotel Style Sambar Idli

మ‌సాలా దినుసులు..

ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ‌పప్పు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 5, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క‌.

హోట‌ల్ స్టైల్ ఇడ్లీ సాంబార్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఎండుమిర్చి త‌ప్ప మిగిలిన మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. దినుసులు వేగిన త‌రువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి చ‌క్క‌గా వేగిన త‌రువాత వీటిని జార్ లో వేసుకోవాలి. ఇందులోనే ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు, వెల్లుల్లి రెబ్బ‌లు,మిరియాలు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి.

టమాట ముక్క‌లు మెత్త‌గా వేగిన త‌రువాత అందులో కందిప‌ప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో ఉప్పు, ప‌సుపు, చింత‌పండు ర‌సం, మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్చ‌, బెల్లం, రెండు గ్లాసుల నీళ్లు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు సాంబార్ ను మ‌ధ్య‌స్ధ మంట‌పై 15 నిమిషాల పాటు మ‌రిగించాలి. ఇలా మ‌రిగించిన త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే హోట‌ల్ స్టైల్ ఇడ్లీ సాంబార్ త‌యార‌వుతుంది. దీనిని ఇడ్లీల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ సాంబార్ తో తింటే ఎన్ని ఇడ్లీలు తిన్నారో తెలియ‌కుండా తినేస్తారు.

D

Recent Posts