Piles Home Remedy : మ‌ల‌ద్వారం వ‌ద్ద మంట‌, నొప్పి, ఇత‌ర స‌మ‌స్య‌ల‌కు.. అద్భుత‌మైన చిట్కా.. ఏం చేయాలంటే..?

Piles Home Remedy : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది మొల‌ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య వ‌ల్ల క‌లిగే బాధ అంతా ఇంతా కాదు. మల‌విస‌ర్జ‌న స‌మ‌యంలో ఈ నొప్పి మ‌రింత అధికంగా ఉంటుంది. అలాగే మొల‌ల వెంట ర‌క్తం కూడా కారుతుంది. ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌న ఆహార‌పు అల‌వాట్లే. జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, నీటిని త‌క్కువ‌గా తాగ‌డం, క‌ద‌ల‌కుండా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవ‌డం, ఫైబ‌ర్ త‌క్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. మొల‌ల స‌మ‌స్య‌తో బాధ‌పడే వారిలో చాలా మంది మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌తో కూడా బాధ‌ప‌డుతూ ఉంటారు. వీరిలో మ‌ల‌విస‌ర్జ‌న సాఫీగా సాగ‌దు. దీంతో మొల‌ల స‌మ‌స్య మ‌రింత తీవ్ర‌మ‌వుతుంది.

అయితే ఒక చ‌క్క‌టి ఇంటి చిట్కాను ఉప‌యోగించి మ‌నం చాలా సుల‌భంగా మొల‌ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.ఈ చిట్కా మొల‌ల‌ను త‌గ్గించి జీర్ణ‌క్రియ‌ను సాఫీగా చేయ‌డంలో ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. మొల‌ల‌ను త‌గ్గించే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం నిమ్మ‌కాయ‌ను, ప‌సుపును, జీల‌క‌ర్ర పొడిని ఉప‌యోగించాల్సి ఉంటుంది. మొల‌ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు నిమ్మ‌కాయను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. నిమ్మ‌ర‌సంలో ఉండే సిట్ర‌స్ ప్రేగుల్లో ఉండే మ‌లాన్ని మెత్త‌గా చేయ‌డంతో మ‌ల‌ద్వారం వ‌ద్ద త‌లెత్తే స‌మ‌స్య‌ల‌న్నింటిని తొల‌గించ‌డంలో ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. నిమ్మ‌కాయ నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌విస‌ర్జ‌న స‌మ‌యంలో నొప్పి లేకుండా ఉంటుంది. అలాగే ఆర్గానిక్ ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

Piles Home Remedy works effectively how to do it
Piles Home Remedy

మొల‌ల‌ను త‌గ్గించ‌డంలో ప‌సుపు అద్భుతంగా ప‌ని చేస్తుంది. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మొల‌ల వ‌ల్ల క‌లిగే నొప్పి, వాపు నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అలాగే జీల‌క‌ర్ర పొడిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల కూడా మొల‌ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ముందుగా ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర‌ను క‌ళాయిలో వేసి వేయించి పొడిగా చేసుకోవాలి. జీల‌క‌ర్ర‌ను వాడ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. దీనిని వాడ‌డం వ‌ల్ల అజీర్తి, మొల‌లు, బంక విరోచ‌నాలు వంటి ఎన్నో జీర్ణ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య దూర‌మ‌వుతుంది. ఈ ప‌దార్థాల‌తో ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా మొల‌ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. దీని కోసం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర చెక్క నిమ్మ‌ర‌సాన్ని పిండాలి.

త‌రువాత ఇందులో పావు టీ స్పూన్ ప‌సుపు, ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న నీటిని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవాలి. ఇలా వారం రోజుల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా మొల‌ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ చిట్కాను పాటిస్తూనే చ‌క్క‌టి జీవ‌న విధానాన్ని పాటించాలి. నీటిని ఎక్కువ‌గా తాగాలి. వ్యాయాం చేయాలి. ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. జంక్ ఫుడ్ ను, నూనెలో వేయించిన ప‌దార్థాలను, మ‌సాలా ఆహారాల‌ను త‌క్కువ‌గా తీసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా మొల‌ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

D

Recent Posts