Pulipirlu : మనల్ని వేధించే చర్మ సంబంధిత సమస్యల్లో పులిపుర్లు కూడా ఒకటి. వీటితో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ప్రతి వందమందిలో కనీసం 20 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇవి శరీరంలో ఎక్కడైనా రావచ్చు. పులిపిర్లు హ్యూమన్ ప్యాపిలోమా అనే వైరస్ కారణంగా తలెత్తుతాయి. పులిపిర్ల వల్ల ఎటువంటి హాని కలగనప్పటికి ఇవి చూడడానికి అందవిహీనంగా ఉంటాయి. చాలా మంది వీటిని సర్జరీల ద్వారా తొలగించుకుంటారు. కొందరు చాకు, బ్లేడు వంటి వాటితో కట్ చేస్తూ ఉంటారు. అయితే ఇవి అన్ని కూడా నొప్పిని కలిగించే పద్దతులు. కొన్ని ఇంటి చిట్కాలను వాడడం వల్ల చాలా సులభంగా మనం పులిపిర్లను తొలగించుకోవచ్చు. ఈ చిట్కాలను వాడడం వల్ల ఎటువంటి నొప్పి ఉండదు అలాగే ఇవి ఎటువంటి దుష్ప్రభావాలను కూడా కలిగించవు.
పులిపిర్లను తొలగించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పులిపిర్లను తగ్గించడంలో ఉల్లిపాయ మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఉల్లిపాయలో అధికంగా ఉండే సల్ఫర్ పులిపిర్లను తొలగించడంలో దోహదపడుతుంది. దీని కోసం ఉల్లిపాయను తీసుకుని ముక్కలుగా కట్ చేసి జార్ లో వేసుకోవాలి. తరువాత దీనిని పేస్ట్ గా చేసి దాని నుండి రసాన్ని తీయాలి. ఈ ఉల్లిపాయ రసంలో కొబ్బరి నూనె వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో దూదిని లేదా కాటన్ బడ్ ను ముంచి పులిపిర్లపై రాయాలి. తరువాత వీటిపై ప్లాస్టర్ లేదా బ్యాండేజ్ వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా వారం రోజుల పాటు చేయడం వల్ల పులిపిర్లు వాటంతట అవే రాలిపోతాయి. పులిపిర్లను తగ్గించే రెండో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థం వెల్లుల్లి. వెల్లుల్లిలో యాంటీ వైరస్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి పులిపిర్లను తొలగించడంలో ఎంతగానో సహాయపడతాయి. దీని కోసం వెల్లుల్లి రెబ్బలను తీసుకుని మెత్తని పేస్ట్ లాగా చేయాలి. తరువాత ఈ పేస్ట్ ను పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేసుకోవాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వారం రోజుల పాటు ఇలా వెల్లుల్లి మిశ్రమాన్ని రాసుకోవడం వల్ల పులిపిర్లు వాటంతట అవే తొలగిపోతాయి. ఈ విధంగా ఈ రెండు చిట్కాలను వాడడం వల్ల సహజ సిద్దంగా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా పులిపిర్లను తొలగించుకోవచ్చు.