Stomach Pain : క‌డుపునొప్పి తగ్గ‌డానికి అద్భుత‌మైన ఇంటి చిట్కాలు.. ఇలా చేయాలి..!

Stomach Pain : క‌డుపు నొప్పి.. మ‌న‌ల్ని వేధించే జీర్ణ సంబంధింత స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. క‌డుపు నొప్పి రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఇన్ఫెక్ష‌న్స్, అతిగా తిన‌డం, ఒకేసారి ఎక్కువ‌గా నీటిని తాగ‌డం, వాతావ‌ర‌ణంలో మార్పులు, ఫుడ్ పాయిజ‌న్, బ్యాక్టీరియా క‌లిగిన నీటిని తాగ‌డం, అజీర్తి వంటి వివిధ కార‌ణాల చేత క‌డుపు నొప్పి వ‌స్తూ ఉంటుంది. అలాగే నేటి త‌రుణంలో ర‌సాయ‌నాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. క‌డుపు నొప్పి వ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఈ స‌మ‌స్య త‌లెత్త‌గానే మ‌న‌లో చాలా మంది మందుల‌ను వాడుతూ ఉంటారు. ఇన్ఫెక్ష‌న్ ను త‌గ్గించే యాంటీ బ‌యాటిక్స్ ను వాడుతూ ఉంటారు. క‌డుపు నొప్పి రాగానే మందులు వాడే అవ‌స‌రం లేకుండా ఇంట్లోనే కొన్ని ర‌కాల పానీయాల‌ను త‌యారు చేసుకుని తాగ‌డం మంచిది.

ఈ పానీయాల‌ను తాగ‌డం వ‌ల్ల క‌డుపు నొప్పి చాలా సుల‌భంగా త‌గ్గుతుంది. ఇన్ఫెక్ష‌న్ కూడా త‌గ్గు ముఖం ప‌డుతుంది. క‌డుపు నొప్పిని త‌గ్గించే పానీయాలు ఏమిటి.. వీటిని ఎలా త‌యారు చేసుకోవాలి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. క‌డుపు నొప్పిని త‌గ్గించ‌డంలో లెమ‌న్ టీ మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. అజీర్తిని త‌గ్గించ‌డంలో, క‌డుపు నొప్పిని త‌గ్గించ‌డంలో, క‌డుపులో ఇన్ఫెక్ష‌న్ ను త‌గ్గించ‌డంలో లెమ‌న్ టీ స‌హాయ‌ప‌డుతుంది. ఈ టీని త‌యారు చేసుకోవ‌డానికి గానూ ఒక గిన్నెలో 3 క‌ప్పుల నీటిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో 4 లేదా 5 తుల‌సి ఆకులు, 3 నిమ్మ‌కాయ ముక్క‌లు, ఒక టేబుల్ స్పూన్ వాము వేసి ఈ నీటిని చిన్న మంట‌పై బాగా మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు ఆ త‌రువాత వ‌డ‌కట్టుకుని తాగాలి. ఇలా నిమ్మ‌కాయ టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల క‌డుపు నొప్పి నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. క‌డుపు నొప్పిని ప్ర‌భావవంతంగా త‌గ్గించ‌డంలో అల్లం టీ ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది.

Stomach Pain home remedies do like this
Stomach Pain

దీని కోసం ఒక గిన్నెలో 2 క‌ప్పుల నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక ఇంచు అల్లం ముక్క‌ను, కొన్ని మిరియాల‌ను దంచి వేసుకోవాలి. త‌రువాత ఈ నీటిని మ‌రిగించి వ‌డక‌ట్టుని గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో తేనెను క‌లిపి తాగాలి. ఇలా అల్లం టీ ని తయారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా క‌డుపు నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల క‌డుపు ఉబ్బ‌రం, అజీర్తి, త‌ల తిరగ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. క‌డుపులో నొప్పి ఇన్ఫెక్ష‌న్ ల‌ను త‌గ్గించ‌డంలో పెరుగు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, జీర్ణ‌క్రియ సాఫీగా సాగేలా చేయ‌డంలో పెరుగు చ‌క్క‌గా పని చేస్తుంది. దీని కోసం ఒక క‌ప్పు పెరుగును తీసుకోవాలి.

త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర పొడి, చిటికెడు న‌ల్ల ఉప్పు వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నొప్పి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అదే విధంగా సోంపు గింజ‌ల‌తో టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. సోంపు గింజ‌ల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగ‌ల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్ష‌న్ ల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయప‌డ‌తాయి. అంతేకాకుండా సోంపు గింజ‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఈ టీ ని తయారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక క‌ప్పు నీటిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో 5 లేదా 6 తుల‌సి ఆకులు, ఒక టీ స్పూన్ సోంపు గింజ‌లు వేసి మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి తాగాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా క‌డుపు నొప్పి త‌గ్గుతుంది. ఈ పానీయాల‌ను తాగిన‌ప్ప‌టికి క‌డుపు నొప్పి త‌గ్గ‌క‌పోతే వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించి త‌గిన చికిత్స తీసుకోవాలి.

D

Recent Posts