Thyroid : శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒకటి. ఈ గ్రంథి మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. శారీరక ఎదుగుదలలో ఈ గ్రంథి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి సరిగ్గా పని చేయకపోవడం వల్ల హైపర్ థైరాయిడిజం, హైపో థైరాయిడిజంతోపాటు ఆర్థరైటిస్ సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుత కాలంలో ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు అధికమవుతున్నారు. ఈ సమస్య బారిన పడితే జీవితాంతం మందులు మింగాల్సిందే. ఈ థైరాయిడ్ సమస్యను ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా నివారించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లోనే ఒక రకమైన జ్యూస్ ను తయారు చేసుకుని వాడడం వల్ల థైరాయిడ్ ని తరిమికొట్టవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. థైరాయిడ్ ను నివారించే జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. ఈ జ్యూస్ ను ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గాను ఒక కీరదోసను, కొత్తిమీరను, ఒక కప్పు నీటిని, రెండు క్యారెట్ లను, ఒక నిమ్మకాయను, చిన్న అల్లం ముక్కను ఉపయోగించాల్సి ఉంటుంది. కీరదోసలో విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే అయోడిన్ థైరాయిడ్ ను నివారించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
అదే విధంగా క్యారెట్ లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ లు అధికంగా ఉంటాయి. ఒకవేళ శరీరంలో విటమిన్ ఎ తక్కువగా ఉంటే టిఎస్‌హెచ్ అనే థైరాయిడ్ హార్మోన్ అధికంగా విడుదల అవుతుంది. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పని చేయాలంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ అవసరమవుతాయి. పైన తెలిపిన పదార్థాలతో జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గాను ఒక జార్ లో కీరదోస ముక్కలను, క్యారెట్ ముక్కలను, అల్లం ముక్కలను, తరిగిన కొత్తిమీరను, నీళ్లను, నిమ్మరసాన్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ జ్యూస్ ను వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసిన జ్యూస్ ను ప్రతిరోజూ ఉదయం పూట తాగడం వల్ల థైరాయిడ్ సమస్యను నివారించుకోవచ్చు.
అలాగే థైరాయిడ్ సమస్య నుండి బయట పడేసే మరిన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ధనియాలతో చేసిన నీటిని తాగడం వల్ల కూడా మనం థైరాయిడ్ సమస్య నుండి బయట పడవచ్చు. ఈ నీటిని తయారు చేసుకోవడానికి గాను ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి మూత పెట్టి చిన్న మంటపై 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. రుచి కోసం ఆ నీటిలో తేనెను కలిపి తాగాలి.
ఈ ధనియాల నీటిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల హైపో థైరాయిడిజంను తగ్గించుకోవచ్చు. ఈ ధనియాల నీటిని తాగడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈ నీటిని తాగడం వల్ల ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. ఈ నీటిని గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా తాగవచ్చు. ఈ ధనియాల నీటిని తాగడం వల్ల అన్ని రకాల థైరాయిడ్ సమస్యలను నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.