Honey And Lemon : చిన్న‌పాటి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు.. స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..!

Honey And Lemon : మ‌నం ఆహారంలో భాగంగా నిమ్మ‌ర‌సాన్ని అలాగే తేనెను కూడా తీసుకుంటూ ఉంటాం. ఇవి రెండు కూడా ఎన్నో ఔష‌ధ గుణాలను క‌లిగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే వీటిని విడివిడిగా తీసుకోవ‌డానికి బ‌దులుగా తేనె, నిమ్మ‌ర‌సాన్ని క‌లిపి తీసుకుంటే మ‌నం అధిక ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. నిమ్మ‌ర‌సంలో తేనెను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. నిమ్మ‌ర‌సం అదే విధంగా తేనెలో ఉండే ఔష‌ధ గుణాల గురించి అలాగే వీటిని తీసుకోవ‌డం వల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మ‌ర‌సంలో విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. జ‌లుబు చేసిన వారికి నిమ్మ‌ర‌సం చ‌క్క‌గా పని చేస్తుంది. నిమ్మ ర‌సాన్ని ఉప‌యోగించి చ‌ర్మ సౌంద‌ర్యాన్ని, జీర్ణ‌శ‌క్తిని మెరుగు ప‌రుచుకోవ‌చ్చు. వేడి నీటిలో నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయం శుభ్ర‌ప‌డుతుంది. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల ప‌చ్చ‌కామెర్ల వ్యాధితోపాటు ఊబ‌కాయం స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. మ‌ల‌బ‌ద్దకం, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి ఆక‌లి శ‌క్తి పెరుగుతుంది.

Honey And Lemon can cure most of the health problems
Honey And Lemon

చ‌ర్మంపై ఉండే మొటిమ‌ల‌ను, మృత క‌ణాల‌ను తొల‌గించ‌డంలో, పాదాల‌ను మృదువుగా ఉంచ‌డంలో జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించి జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా నిమ్మ‌ర‌సం మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. అదే విధంగా తేనె కూడా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. తేనెలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉన్నాయి. తేనె ఎంతో బ‌ల‌వ‌ర్ద‌క‌మైన ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండ‌దు. నిమ్మ‌ర‌సం, తేనె మిశ్ర‌మాన్ని త‌యారు చేసుకోవ‌డానికి ముందుగా ఒక గ్లాస్ వేడి నీటిని తీసుకుని అందులో ఒక నిమ్మ‌కాయ‌లో ఉన్న ర‌సాన్నంతా పిండాలి.

త‌రువాత ఒక టీ స్పూన్ తేనెను క‌లిపి ఆ నీటిని తాగాలి. ఇలా ప్ర‌తిరోజూ చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్తం శుద్ధి అవుతుంది. అలాగే శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి స‌న్న‌బ‌డ‌తారు. ముఖంపై ముడ‌త‌లు, మొటిమ‌లు త‌గ్గుతాయి. చ‌ర్మం బిగుతుగా ఉంటుంది. ఇలా త‌యారు చేసుకున్న నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని మ‌లినాలు తొల‌గిపోయి శ‌రీరం శుద్ధి అవుతుంది. నీర‌సంగా ఉన్న‌ప్పుడు ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. శ‌రీరం యొక్క వ్యాధి నిరోధ‌క శ‌క్తి మెరుగుప‌డుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

నిమ్మ‌ర‌సం, తేనె క‌లిపిన నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర పిండాల్లో రాళ్ల స‌మ‌స్య రాకుండా ఉంటుంది. ఈ విధంగా నిమ్మ‌ర‌సం, తేనె క‌లిపిన నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని అలాగే ఈ నీటిని తాగ‌డం అల‌వాటు చేసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts