Tea Powder For Hair : జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు రాలడం, జుట్టు పొడి బారడం, జుట్టు తెల్లగా అవ్వడం వంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. కారణాలేవైనప్పటికి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. జుట్టును అందంగా, ధృడంగా, పొడవుగా, నల్లగా మార్చుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసి విఫలమైనవారు ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఇంటి చిట్కాను ఉపయోగించి అన్ని రకాల జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లగా, ధృడంగా పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగపరిచే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం టీ పౌడర్ ను, పెరుగును, బాదం నూనెను, కలబంద గుజ్జును, విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో లేదా రోట్లో కొద్దిగా టీ పౌడర్ ను వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని జల్లించి దాని నుండి 2 టీ స్పూన్ల మోతాదులో టీ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో అర కప్పు పెరుగును వేసి బాగా కలపాలి. తరువాత దీనిలో 2 టీ స్పూన్ల బాదం నూనెను, ఒక టీ స్పూన్ కలబంద గుజ్జును వేసి కలపాలి. చివరగా విటమిన్ ఇ క్యాప్సుల్ ను వేసి కలపాలి. బాదం నూనె అందుబాటులో లేని వారు కొబ్బరి నూనెను కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు చక్కగా పట్టించాలి. ఇలా పట్టించిన తరువాత ఈ మిశ్రమం ఆరే వరకు అలాగే ఉండాలి. తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో తలస్పానం చేయాలి.
ఇలా వారానికి రెండు సార్లు నుండి మూడు సార్లు చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడువుగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్లకు పోషకాలు అంది జట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు, జుట్టు పొడిబారడం, జుట్టు చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి. నేటి తరుణంలో వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల చేత చాలా మంది జుట్టు సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. అలాంటి వారు ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా జుట్టును కాంతివంతంగా మార్చుకోవచ్చు. బయట రసాయనాలు కలిగిన షాంపులను, హెయిర్ కండిష్ నర్ లను, హెయిర్ డైల ను వాడడం వల్ల అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లోనే ఈ విధంగా చక్కటి చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల ఎటువంటి చెడు ఫ్రభావాలు లేకుండా ఆరోగ్యవంతమైన, మృదువైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.