Samanyudu : థియేట‌ర్‌ల‌లో ఫెయిల్‌.. ఓటీటీలో హిట్ అయిన విశాల్ సామాన్యుడు మూవీ..!

Samanyudu : ప్ర‌స్తుతం ప్రేక్షకులు ఓటీటీల‌కు ఎలా అల‌వాటు ప‌డ్డారో అంద‌రికీ తెలిసిందే. కొన్ని సినిమాలు థియేట‌ర్ల‌లో హిట్ కావ‌డం లేదు. కానీ ఓటీటీల్లో మాత్రం హిట్ కొడుతున్నాయి. ఇక విశాల్ న‌టించిన తాజా చిత్రం సామాన్యుడు కూడా థియేట‌ర్ల‌లో పెద్ద‌గా ఆద‌ర‌ణ ద‌క్కించుకోలేక‌పోయింది. కానీ ఓటీటీలో మాత్రం హిట్ అయింది. ఈ సినిమాను ప్రేక్ష‌కులు భారీ ఎత్తున వీక్షిస్తున్నారు.

Samanyudu  movie of Vishal got hit talk on OTT
Samanyudu

విశాల్‌, డింపుల్ హ‌య‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన సామాన్యుడు మూవీ మార్చి 4న జీ5 యాప్‌లో రిలీజ్ అయింది. దీన్నే త‌మిళంలో వీర‌మే వాగై సోదుమ్ పేరిట రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైన‌ప్పుడు హిట్ టాక్‌ను సాధించ‌లేదు. అస‌లు ఈ మూవీ వ‌చ్చి వెళ్లిన‌ట్టు కూడా ఎవ‌రికీ తెలియ‌దు. కానీ ఓటీటీలో స్ట్రీమ్ అవ‌డం ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి అందులో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీని ఓటీటీలో ప్రేక్ష‌కులు భారీ ఎత్తున వీక్షిస్తున్నారు.

ఇక తెలుగు, త‌మిళం మాత్ర‌మే కాకుండా క‌న్న‌డలోనూ ఈ మూవీని రిలీజ్ చేశారు. ఇందులో ర‌వీనా ర‌వి, యోగి బాబు, ర‌మ‌ణ ప‌లు ఇత‌ర పాత్ర‌ల్లో నటించారు. ఈ మూవీకి డిబ్యుటంట్ డైరెక్ట‌ర్ తు పా శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. యాక్ష‌న్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Editor

Recent Posts