Pancreas : షుగ‌ర్ ఉందా.. అయితే ఈ విష‌యాన్ని తప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

Pancreas : ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించే హార్మోన్ ఇన్సులిన్ అన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఈ ఇన్సులిన్ హార్మోన్ ను ప్రాంకియాస్ గ్రంథి ఉత్ప‌త్తి చేస్తుంది. ప్రాంకియాస్ గ్రంథిలో ఇన్సులిన్ ను ఉత్ప‌త్తి చేసే క‌ణాల‌ను బీటా క‌ణాలు అంటారు. ఈ బీటా క‌ణాలు దెబ్బ‌తింటే ఇన్సులిన్ ఉత్ప‌త్తి త‌గ్గుతుంది. అలాగే ఇన్సులిన్ నాణ్య‌త కూడా త‌గ్గుతుంది. బీటా క‌ణాలు మ‌న శ‌రీరంలో ఉండే ఫ్రీరాడిక‌ల్స్ కార‌ణంగా దెబ్బ‌తింటాయి. బీటా క‌ణాలు దెబ్బ‌తిన‌డం వ‌ల్ల మ‌నం షుగ‌ర్ వ్యాధితో పాటు ఇత‌ర ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది.

క‌నుక మ‌నం బీటా క‌ణాల‌ను, ప్రాంకియాస్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. ప్రాకింయాస్ గ్రంథిలో ఉండే బీటా క‌ణాల‌ను డీటాక్సిఫై చేసి ఫ్రీరాడికల్స్ ను నాశ‌నం చేయ‌డంలో మ‌న‌కు ఆంబిడిన్ అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నం ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఈ ర‌సాయ‌న స‌మ్మేళ‌నం వాయువిదంగాల్లో ఉంటుంది. వాయువిదంగాలు మ‌న‌కు ఆయుర్వేద షాపుల్లో ల‌భిస్తాయి. అలాగే వీటి పొడి కూడా మ‌న‌కు దొరుకుతుంది. ఈ పొడిని పూట‌కు 5 గ్రాముల మోతాదులో ఒక గ్లాస్ నీటిలో క‌లిపి రెండు పూట‌లా తీసుకోవ‌డం వ‌ల్ల ఫ్రీరాడిక‌ల్స్ న‌శిస్తాయి.

this is the way you can detoxify your pancreas
Pancreas

దీంతో బీటా క‌ణాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల ప్రాంకియాస్ గ్రంథిలో ఫ్రీరాడిక‌ల్స్ ఉ్త‌త్ప‌త్తి కాకుండా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల బీటాక‌ణాల‌కు, ప్రాంకియాస్ గ్రంథికి ఇన్ ప్లామేష‌న్ రాకుండా ఆరోగ్యంగా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు అలాగే భ‌విష్య‌త్తులో షుగ‌ర్ స‌మ‌స్య బారిన ప‌డ‌కుండా ఉండాల‌నుకునే వారు ఈ వాయు విదంగాల పొడిని తీసుకోవ‌డం వల్ల చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

D

Recent Posts