చిట్కాలు

Constipation : వీటిని తిన్న కొద్దిసేపట్లోనే సుఖ విరేచనం.. మలబద్ధకం సమస్య‌ అస్సలే ఉండదు..!

Constipatin : ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ఆరోగ్యం లేకపోతే అనవసరంగా రోజు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగుండాలంటే మంచి జీవన విధానాన్ని అనుసరిస్తూ ఉండాలి. దానితో పాటు శరీరానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా బలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా వీటిని తీసుకోండి. వీటిని తిన్న ఐదు సెకండ్లలోనే సుఖ విరేచనం అవుతుంది.

సుఖ విరేచనం అవ్వాలంటే ఏం చేయాలి.? అనే విషయాన్ని మరి ఇప్పుడే చూసేయండి.. విరేచనం మనం తీసుకునే ఆహారం బట్టి అవుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే విరేచనం బాగా అవుతుంది. సుఖ విరేచనం కోసం లేత సొరకాయని తినండి. లేత సొరకాయని తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పైగా విరోచనం కూడా బాగా అవుతుంది. సొరకాయని తీసుకునేటప్పుడు మీరు దాని తొక్క తీయకుండా, తొక్కతో పాటుగా ఆహారంలో చేర్చుకోండి.

to get rid of constipation take these foods to get rid of constipation take these foods

లేత బీరకాయలని కూడా మీ డైట్ లో చేర్చుకోండి. బీరకాయలని కూడా తొక్క తీయకుండా వండుకుని, తీసుకుంటే సుఖ విరేచనం అవుతుంది. అజీర్తి సమస్యలు కూడా కలగవు. మంచి దోసకాయలని కొనుగోలు చేసి తొక్కతో పాటుగా దోసకాయలని వండుకుని తీసుకుంటే, సుఖ విరేచనం అవుతుంది. వీటన్నిటిని మీరు వండేటప్పుడు గింజల్ని తీయకండి. గింజలతో పాటుగా కూరని వండేసుకోండి. అదేవిధంగా లేత అరటికాయల్ని కూడా తొక్కతో పాటుగా కూర చేసుకు తీసుకోండి. క్యారెట్లు, కీరదోస ని కూడా తొక్కతో పాటుగా వండుకోండి.

ఈ పీచు పదార్థాల వలన సుఖ విరేచనం అవుతుంది. కమల పండ్లు, దానిమ్మ పండ్లు, తేగలని కూడా ఎక్కువగా తీసుకోండి. వీటిని తీసుకోవడం వలన ఫైబర్ బాగా అందుతుంది. విరేచనం బాగా అవుతుంది. కొర్రలు ని కూడా చేర్చుకోవడం మంచిది. అలానే మంచినీళ్ళని కూడా ఎక్కువగా తాగుతూ ఉండండి. ఇలా ఈ మార్పులని మీరు మీ డైట్ లో చేసుకుంటే ఖచ్చితంగా సుఖ విరేచనం అవుతుంది.

Admin

Recent Posts