Shampoo Hair Pack : అందమైన జుట్టును ప్రతి ఒక్కరూ కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఎన్ని రకాల ప్రయత్నాలను చేసినప్పటికీ అవి సత్ఫలితాలను ఇవ్వవు. మనం సహజ సిద్ధంగా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మన జుట్టును అందంగా ఉంచుకోవచ్చు. పూర్వకాలంలో పెద్దవారిలో మాత్రమే మనం జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం, బట్టతల రావడం వంటి వాటిని చూసే వాళ్లం. కానీ ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిలోనూ మనం ఈ జుట్టు సంబంధిత సమస్యలను చూడవచ్చు.
ప్రస్తుత కాలంలో రసాయనాలు కలిగిన షాంపూలను వాడడం వల్ల జుట్టు ఆరోగ్యం మరింత దెబ్బ తింటోంది. మనం తరచూ వాడే షాంపూలలో మరికొన్ని ఇతర పదార్థాలను కలిపి వాడడం వల్ల జట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా పెరుగుదల ఆగిన జుట్టు కూడా మరలా పెరుగుతుంది. జుట్టును అందంగా ఉంచే ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులో మనం తరచూ వాడే షాంపూను మన జుట్టుకు తగిన మోతాదులో తీసుకోవాలి.
తరువాత అందులో రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జును వేసి బాగా కలపాలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ పంచదార పొడిని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న షాంపూ మిశ్రమంతో తలస్నానం చేయాలి. ఈ షాంపూను తలకు పట్టించి ఐదు నిమిషాల పాటు మర్దనా చేసుకుని తరువాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు పోషణ అంది జుట్టు పెరుగుదల చక్కగా ఉంటుంది.
ఈ మిశ్రమాన్ని వాడడం వల్ల తల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోయి జుట్టు రంధ్రాలు తెరుచుకుని జుట్టు రాలిన ప్రదేశంలో కూడా మరలా కొత్త జుట్టు వస్తుంది. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల జుట్టు అందంగా, ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా తయారవుతుంది.