Tomato Face Pack : అందమైన రూపంతో మెరిసిపోవాలని ఎవరికుండదు చెప్పండి. అందంగా, ఆకర్షణీయంగా మారాలని అందరికీ ఉంటుంది. దీనికోసం ఎంతో ఖర్చు పెడతూ ఖరీదైన క్రీమ్స్ వాడతారు. ఎన్నెన్నో టిప్స్ ఫాలో అయిపోతారు. ఇలాంటి వాటి కంటే మన ఇంటి చిట్కాలు వాడడం ఎంతో ఉత్తమం. ఈ చిట్కాతో తక్కువ ఖర్చుతో ఎక్కువ అందాన్ని పొందవచ్చు. టమాటాని వంటలో వాడితే ఎంత రుచి వస్తుందో.. ఈ టమాటనే బ్యూటీని పెంచుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు టమాటాతో అందాన్ని ఎలా మెరుగుపరుచుకోవలో తెలుసుకుందాం.
టమాటాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. చర్మ రంగుని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు వంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. ఈ ప్యాక్ లో మరొక పదార్ధం శనగపిండిని ఉపయోగిస్తున్నాం. ఈ రెండు కూడా చర్మ సంరక్షణలో సహకరిస్తాయి. విటమిన్ సి మన శరీరంలో కొలాజిన్ పొరను సక్రమంగా ఉండేలా చూస్తుంది.
ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక టీస్పూన్ టమాటా రసం, ఒక టీస్పూన్ శనగ పిండి, ఒక టీస్పూన్ అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోవాలి. ముఖానికి రాసుకున్న ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తర్వాత మృదువుగా చేతితో మర్దనా చేసుకోవాలి. ఇలా మర్దనా చేసుకోవడం వల్ల ముఖంపై బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా జరిగి నల్లని మచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి.
ఈ చిట్కాని వారానికి మూడుసార్లు ఉపయోగించడం ద్వారా మంచి ప్రయోజనం కనిపిస్తుంది. ముఖం కూడా ఎంతో అందంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. అలోవెరా జెల్ లో ఉండే విటమిన్ ఇ ముఖంపై నల్ల మచ్చలను తొలగించడానికి ఎంతగానో సహకరిస్తుంది.