White Teeth : దంతాల‌పై ఉండే గార‌ను తొల‌గించి తెల్ల‌గా మార్చే చిట్కా.. కొద్ది రోజులు పాటిస్తే చాలు..

White Teeth : మ‌న శ‌రీరంలో దంతాలు ఒక కూడా ఒక భాగ‌మే. దంతాల‌ను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. దంతాల‌ను నిర్లక్ష్యం చేస్తే అనేక ర‌కాల దంత సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా మ‌న శ‌రీరంలో అత్యంత బాధాక‌ర‌మైన స‌మ‌స్య దంత స‌మ‌స్య‌. దంతాల వల్ల క‌లిగే నొప్పి వ‌ర్ణ‌నాతీతంగా ఉంటుంది. అలాగే మ‌న ముఖం అందంగా క‌నిపించ‌డంలో కూడా దంతాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖం ఎంత అందంగా ఉన్న‌ప్ప‌టికి దంతాలు ప‌చ్చ‌గా, గారె ప‌ట్టి ఉంటే చూడ‌డానికి అందంగా ఉండ‌వు. దంతాలు క‌నుక వ‌దులైతే అందంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బ‌తింటుంది.

దంతాలు దెబ్బ‌తిన‌డానికి కార‌ణం మ‌న నోట్లో ఉండే క‌లిగే బ్యాక్టీరియ‌ల్ ఇన్ఫెక్షన్ లు. వీటి కార‌ణంగా మ‌న దంతాలు వ‌దుల‌వుతాయి. అంతేకాకుండా అనేక ర‌కాల దంత సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ఒక ఇంటి చిట్కాను ఉప‌యోగించి దంతాల స‌మ‌స్య‌ల‌ను తొల‌గించుకోవ‌డంతో పాటు దంతాల‌ను కూడా తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. నోట్లో ఉన్న బ్యాక్టీరియ‌ల్ ఇన్ఫెక్ష‌న్ ల‌ను తొల‌గించి దంతాల‌ను తెల్ల‌గా మార్చే ఒక ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ ఆవ‌నూనెను తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక చిటికెడు ప‌సుపును, ఒక చిటికెడు ఉప్పును వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ మోతాదులో క్యారెట్ తురుమును వేసి క‌ల‌పాలి.

White Teeth home remedy in telugu very effective
White Teeth

ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని బ్ర‌ష్ తో తీసుకుని రోజూ ఉద‌యం దంతాల‌ను శుభ్ర‌ప‌రుచుకోవాలి. మూడు నుండి నాలుగు నిమిషాల పాటు దంతాల‌ను శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల దంతాల పై పేరుకుపోయిన గారె తొల‌గిపోయి దంతాలు తెల్ల‌గా మార‌తాయి. అంతేకాకుండా వ‌దులైన దంతాలు కూడా గట్టిగా మార‌తాయి. దంతాలు పుచ్చిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో మ‌నం ఉప‌యోగించిన ప‌దార్థాల‌న్నీ కూడా స‌హ‌జ‌సిద్ద‌మైన‌వే. క‌నుక ఈ మిశ్ర‌మాన్ని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌దు. దంత సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాద‌ప‌డే వారు ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

D

Recent Posts