చిట్కాలు

తేన్పులు వస్తున్నాయా ? ఇవీ పరిష్కారాలు

తేన్పులు, బేకోట్లు అందరి ముందు పెద్దగా తేన్పులు వచ్చినప్పుడు ఇబ్బందిగా ఫీలవుతున్నారా? అయితే మాట్లాడకండి! ఇదేంటి మాట్లాడకండి అంటున్నారు అనుకుంటున్నారా? అదేనండి తినేటప్పుడు మాట్లాడకండి అంటున్నాం. ముచ్చట్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ భోజనం చేస్తుంటారు. అయిపోగానే బేవ్‌వ్.. అంటూ తేన్పడం వల్ల ఎదుటివాళ్లు ఏమీ అనలేక ఒక చూపు చూస్తారు. ఆ చూపు చాలు అక్కడి నుంచి లేచి వెళ్లిపోవడానికి. అసలు ఏ తేన్పులు ఎందుకు వస్తాయి. వాటి నుంచి బయట పడడానికి పరిష్కారం ఏంటో తెలుసుకోండి.

1. ఆహారం తీసుకున్న వెంటనే తేన్పులు వస్తుంటాయి. ఇందుకు ఏం చేయాలంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. దీంతోపాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కడుపులో అతిగా పేరుకుపోయిన వాయువులు బయటకు తేన్పుల రూపంలో వస్తాయి. ఈ వాయువులు జీర్ణాశయంలో చేరడానికి కారణాలున్నాయి. ఆహారం తీసుకునేటప్పుడు ముఖ్యంగా మాట్లాడకూడదు. అలా చేస్తే ఆహారం తీసుకుంటున్నప్పుడు అధికంగా గాలిని మింగడం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, ఎసిడిటి, హియాటస్ హెర్మా వంటివాటితో కడుపులో వాయువులు ఉత్పత్తి అవుతాయి. ఈ సమస్య ఎక్కువైతే కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

wonderful home remedies to reduce belching

2. ఇంకా ఆహారం తీసుకునేటప్పుడు నిదానంగా నమిలి తింటే పొట్టలో గాలి చేరకుండా చూసుకోవచ్చు. పాలు, చిక్కుడు జాతికూరలు, క్యాబేజీ, ఉల్లిగడ్డతోపాటు వేపుళ్లను తగ్గించుకోవాలి. అప్పుడే వాయువులు తగ్గుతాయి. అల్లం, శొంఠి, ఇంగువ, వాము, పుదీనా, సోంపు, జీలకర్రను ఎక్కువగా వాడుతుంటే తేన్పులను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఒకసారి తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేవరకు మళ్లీ తీసుకోకూడదు. ఆకలి వేసినప్పుడే ఆహారం తీసుకోవాలి.

పరిష్కారం :

– రెండు లేదా మూడు లేత తమలపాకుల్లో వక్క, ఒక లవంగం వేసుకోవాలి.

– అన్నం తిన్న తర్వాత ఈ తాంబూలం నోట్లో పెట్టుకొని నెమ్మదిగా నములుతూంటే సమస్య తగ్గుతుంది.

– పుదీనా పచ్చడిని తరచూ ఆహారంలో తింటుంటే తేన్పులు తగ్గుతాయి.

– భోజనం చేసిన వెంటనే అరచెంచా సోంపు నోట్లో వేసుకొని నెమ్మదిగా నిమిలినా ఉపశమనం ఉంటుంది.

– వాము వేయించి పొడి చేసుకోవాలి. కొద్దిగా సోడా అన్నంలో చెంచా వాముపొడి, అరచెంచా కరిగించిన నెయ్యి వేసుకొని తినాలి.

– భోజనం చేసిన వెంటనే అరచెంచా సోంపు నోట్లో వేసుకొని నెమ్మదిగా నిమిలినా ఉపశమనం ఉంటుంది.

Admin

Recent Posts