Sinusitis : మనలో చాలా మంది తరచూ జలుబు, ముక్కు మూసుకుపోవడం వంటి లక్షణాలను ఎదుర్కొంటున్నట్లయితే అలాంటి వారు వారు కచ్చితంగా సైనుసైటిస్ తో బాధపడుతున్నట్టే. ప్రతి మనిషి తన జీవిత కాలంలో సైనుసైటిస్ బారిన పడిన వారే. మనలో 100 శాతం మంది కాకపోయినా కనీసం 90 శాతం మందికి పైగా సైనస్ బారిన పడిన వారే. ముఖంలో కళ్ల దగ్గర, ముక్కు పక్క భాగంలోని ఎముకల్లో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఈ భాగంలో ఇన్ ఫెక్షన్ సోకి వాచిపోవడాన్ని సైనుసైటిస్ అంటారు.
అత్యధికంగా శస్త్రచికిత్సకు దారి తీసే వాటిల్లో సైనుసైటిస్ కూడా ఒకటని అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ సైనుసైటిస్ వ్యాధి వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ ల కారణంగా వస్తుంది. సైనుసైటిస్ సమస్యాత్మకమైనది. ఇది బాధించే లక్షణాలను కలిగి ఉంటుంది. దినచర్యలకు అంతరాయం కూడా కలిగిస్తుంది. సైనుసైటిస్ వల్ల తలనొప్పి, ముక్కుదిబ్బడ, ముక్కులో నొప్పి, గొంతులో నొప్పి, ముఖంలో వాపు, జ్వరం, అలసట, దగ్గు, ముక్కు కారడం, వాసన లేకపోవడం వంటి మొదలగు లక్షణాలు కనబడతాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, తరచూ జలుబుతో బాధపడుతూ ఉండడం, ఎక్కువ సేపు ఏసీలో కూర్చోవడం, వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి వంటి వాటిని సైనుసైటిస్ కి కారణాలుగా చెప్పవచ్చు.
ఈ వ్యాధి బారిన పడితే ఇక ఆపరేషన్ తప్పనిసరి అని, ఆ తరువాత కూడా ఇది మళ్లీ మళ్లీ వచ్చి దీర్ఘకాలికంగా బాధిస్తూ ఉంటుందని ఈ వ్యాధి బారిన పడిన వారు అంటూ ఉంటారు. ఈ సైనుసైటిస్ ను మూడు విభాలుగా చెప్పవచ్చు. మొదటిది అక్యూట్. ఇది వారం రోజులు ఉంటుంది. రెండవది సబ్ అక్యూట్. ఇది నాలుగు నుండి ఎనిమిది వారాల పాటు ఉంటుంది. ఇక మూడవది క్రోనిక్. ఇది దీర్ఘకాలిక సైనుసైటిస్. ఇది ఎనిమిది నుండి పది వారాల పాటు ఉంటుంది. దీర్ఘకాలిక సైనుసైటిస్ తో బాధపడే వారు కళ్ల రెప్పల వాపు, కనుగుడ్లు పక్కకు జరిగినట్టు ఉండడం, కంటి నరాలు దెబ్బతిని చూపు కోల్పోవడం, వాసనలు తెలియకపోవడం, తరచూ జ్వరాలు రావడం, ఎదుగుదలలో లోపాలు కనబడతాయి. మానసికంగా ధైర్యం కోల్పోవడం కూడా జరగవచ్చు.
ఈ సైనుసైటిస్ వ్యాధిని ఆయుర్వేదం ద్వారా కూడా నయం చేసుకోవచ్చని ఆయుర్వేదంలో కూడా ఈ వ్యాధిని నయం చేయడానికి అద్భుతమైన మందులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అది కూడా మన వంటింట్లో ఉండే సాధారణ దినుసులతోనే సాధ్యమవుతుందని వారు తెలియజేస్తున్నారు. ఈ ఔషధాలను కూడా ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకుని వాడవచ్చు. ఇందుకోసం 4 టేబుల్ స్పూన్ల అల్లం రసం, 2 టేబుల్ స్పూన్ల తేనెను, 2 టేబుల్ స్పూన్ల మిరియాల పొడిని ఒక గిన్నెలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకుని రోజూ ఉదయం పరగడుపున అలాగే ఉదయం అల్పాహారం చేసిన తరువాత తీసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా నెల రోజుల పాటు తీసుకోవడం వల్ల సైనస్ సమస్య మరలా రాకుండా ఉంటుంది. ఈ ఆయుర్వేద చిట్కా చాలాకాలం నుండి ప్రాచుర్యంలో ఉంది. ఈ చిట్కాను పాటిస్తూనే చల్లటి పదార్థాలను మానేయడం, ఏసీలలో తక్కువ సేపు కూర్చోవడం, వాతావరణ కాలుష్యానికి దూరంగా ఉండడం వంటివి పాటించాలి. ఈ చిట్కాను పాటించడం వల్ల సైనుసైటిస్ సమస్యను పూర్తిగా నివారించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.