Pongal : ఆరోగ్య‌క‌ర‌మైన పొంగ‌ల్‌.. త‌యారు చేయ‌డం ఇలా..

Pongal : భార‌త‌దేశంలో అనేక వ‌ర్గాలు, మ‌తాల‌కు చెందిన ప్ర‌జ‌లు జీవిస్తున్నారు. ఎన్నో రాష్ట్రాల వాళ్లు త‌మ ఆహార ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు. సంప్ర‌దాయ వంట‌కాల‌ను తింటుంటారు. అయితే అలాంటి వంట‌కాల్లో పొంగ‌ల్ కూడా ఒక‌టి. దీన్ని కేర‌ళ‌, త‌మిళ‌నాడు వాసులు ఎక్కువ‌గా చేస్తుంటారు. కానీ దీన్ని మనం కూడా చేసుకోవ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. ఆరోగ్య‌క‌రం కూడా. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 make Pongal in this method healthy food
Pongal

పొంగ‌ల్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం – 1 క‌ప్పు, పెస‌ర ప‌ప్పు – అర క‌ప్పు, జీల‌క‌ర్ర – 1 టీస్పూన్‌, త‌రిగిన కొత్తిమీర – అర క‌ప్పు, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 5, అల్లం, క‌రివేపాకు, జీడిప‌ప్పు, దంచిన మిరియాలు 1 టీస్పూన్‌, నెయ్యి – 1 టీస్పూన్‌, ఉప్పు, ప‌సుపు, నీళ్లు – త‌గినంత‌.

పొంగ‌ల్‌ను త‌యారు చేసే విధానం..

బియ్యం,పెసరపప్పు కలిపి ఉడికించి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నెయ్యి వెయ్యాలి. నెయ్యి వేడయ్యాక జీడి పప్పు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలి. దానిలో అల్లం తరుగు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరువాత కొద్దిగా పసుపు వేసి ఉడికించి పెట్టిన అన్నం వేసి అందులో మిరియాల పొడి, సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. అన్ని కలిసేలా ఒక అయిదు నిమిషాలు సన్నని మంటపై వేయించాలి. చివరగా కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇక దానిని జీడి పప్పుతో గార్నిష్ చేసి వడ్డించాలి. అంతే ఎంతో రుచికరమైన పొంగల్ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో తింటే ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి.

Editor

Recent Posts