Skin Infection : తొడ‌లు, గ‌జ్జ‌ల్లో ఇలా దుర‌ద‌లు వ‌స్తూ.. ఇన్‌ఫెక్ష‌న్లు ఉంటే.. ఇలా చేయండి.. దెబ్బ‌కు పోతాయి..!

Skin Infection : మ‌న‌లో చాలా మంది వివిధ ర‌కాల చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. చ‌ర్మం పై ఇన్ ఫెక్ష‌న్స్, దుర‌ద‌లు, అల‌ర్జీ, దద్దుర్లు, చ‌ర్మం పొడిబార‌డం వంటి వివిధ ర‌కాల చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వేస‌వికాలంలో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. చ‌ర్మం పై వ‌చ్చే ఈ ఇన్ఫెక్ష‌న్ల కార‌ణంగా చాలా మంది ఎంతో ఇబ్బంది పెడుతుంటారు. చ‌ర్మం పై వ‌చ్చే ఈ ఇన్ఫెక్ష‌న్ లు విప‌రీత‌మైన మంట‌ను, దుర‌ద‌ను, బాధ‌ను, నొప్పిని క‌లిగిస్తాయి. చ‌ర్మానికి గాలి త‌గ‌ల‌కుండా బిగుతైన దుస్తుల‌ను ధ‌రించ‌డం, చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్ట‌డం, చ‌ర్మాన్ని స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, దుమ్ము, వాతావ‌ర‌ణ కాలుష్యం, పెంపుడు జంతువుల నుండి వ‌చ్చే ధూళి, అల‌ర్జీల‌ను క‌లిగించే వివిధ ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం, మందులు వాడ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటాయి.

చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల కార‌ణంగా ఒక్కోసారి న‌లుగురిలో నువ్వుల పాలు కావాల్సి వ‌స్తుంది. ఇటువంటి చర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక చిన్న చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను మ‌నం చాలా సుల‌భంగా దూరం చేసుకోవ‌చ్చు. చ‌ర్మం పై వ‌చ్చే ఇన్ఫెక్ష‌న్ ల‌ను దూరం చేసే ఈ చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం 100 ఎమ్ ఎల్ కొబ్బ‌రి నూనెను, గుప్పెడు వేపాకును, 2 ఇంచుల క‌ల‌బంద కాడ‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా వేపాకును శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా ఆర‌బెట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో కొబ్బ‌రి నూనెను తీసుకోవాలి. త‌రువాత ఇందులో వేపాకును వేసుకోవాలి. త‌రువాత క‌ల‌బంద కాడ‌ను ముక్క‌లుగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెను చిన్న మంట‌పై వేడి చేయాలి. వేపాకులు చ‌క్క‌గా వేగి క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు ఈ నూనెను వేడి చేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

wonderful home remedy for Skin Infection
Skin Infection

నూనె చ‌ల్లారిన త‌రువాత వ‌డ‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు మ‌న‌కు కావ‌ల్సిన ప‌రిమాణంలో ఈ నూనెను తీసుకోవాలి. త‌రువాత ఇందులో రెండు క‌ర్పూరం బిళ్ల‌ల‌ను పొడిగా చేసి వేసుకోవాలి. త‌రువాత క‌ర్పూరం క‌రిగే వ‌ర‌కు బాగా క‌లుపుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న నూనెను రోజూ రాత్రి ప‌డుకునే ముందు స‌మ‌స్య ఉన్న చోట చ‌ర్మానికి రాసుకోవాలి. ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగివేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై వ‌చ్చే ఇన్పెక్ష‌న్ లు, దుర‌ద‌లు, దద్దుర్లు త‌గ్గుతాయి. చ‌ర్మం మెత్త‌బ‌డి మృదువుగా త‌యార‌వుతుంది. వేపాకు, క‌ల‌బంద‌లో యాంటీ వైర‌ల్, యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ ఫంగ‌ల్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్ష‌న్ ల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ విధంగా మ‌న ఇంట్లో ఉండే వాటితో నూనెను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts