Teeth Cavity : దంతాల నొప్పి.. ఈ సమస్య మనలో చాలా మందిని తరచూ ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా మనల్ని వేధించే దంత సంబంధిత సమస్యల్లో ఇది ఒకటి. పంటి నొప్పి కారణంగా మనం వేడి, చల్లటి పదార్థాలను తినలేము. అలాగే తాగలేము కూడా. కారణాలేవైనప్పటికీ ఈ సమస్య నుండి బయటపడడానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. చాలా మంది పంటి నొప్పి సమస్య నుండి సత్వర ఉపశమనాన్ని పొందడానికి పెయిన్ కిల్లర్ ను, యాంటీ బ్యాక్టీరియల్ మందులను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల తాత్కాలిక ఉపశమనం ఉన్నప్పటికీ వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలు అధికంగా ఉంటాయి.
మన వంటింట్లో ఉండే పదార్థాలతో నిమిషాల్లోనే మనం పంటి నొప్పి సమస్య నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ చిట్కాను పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ వాడవచ్చు. పంటి నొప్పిని తగ్గించే చిట్కా ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే ఈ చిట్కాను ఎలా ఉపయోగించాలి.. వంటి తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పంటి నొప్పిని తగ్గించడంలో మిరియాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దంతాల నొప్పుల నుండి ఉపశమాన్ని కలిగించడంలో దోహదపడతాయి.
దంతాల నొప్పులతో బాధపడే వారు ముందుగా రోట్లో ఒక టీ స్పూన్ మిరియాలను వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పావు టీ స్పూన్ ఉప్పును వేసి కలపాలి. తరువాత ఇందులో అర టీ స్పూన్ లేదా తగినన్ని నీళ్లను పోసి ఈ మిశ్రమాన్ని పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఉపయోగించడానికి ముందు నోటిని శుభ్రపరుచుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చేత్తో కానీ, బ్రష్ తో కానీ తీసుకుని నొప్పి ఉన్న పంటి పైన ఉంచాలి. ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న దంతం పైన 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచిన తరువాత నోటిని శుభ్రపరుచుకోవాలి.
ఈ విధంగా మిరియాలను ఉపయోగించడం వల్ల ఎంతో కాలం నుండి వేధిస్తున్న దంతాల నొప్పులు అయినా సరే నిమిషాల్లో తగ్గిపోతాయి. దంతాల నొప్పులతోపాటు పుచ్చిపోయిన దంతాల వల్ల కలిగే నొప్పులను తగ్గించడంలో ఈ కూడా మిశ్రమం దోహదపడుతుంది. అంతేకాకుండా ఈ మిరియాల మిశ్రమంతో రోజుకు రెండు పూటలా దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి. ఈ విధంగా మిరియాల పొడిని, ఉప్పును కలిపి వాడడం వల్ల దంతాల నొప్పులు తగ్గడంతోపాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయి.