Migraine : మనల్ని తరచూ వేధించే అనారోగ్య సమస్యల్లో తలనొప్పి కూడా ఒకటి. తలనొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఆందోళన, ఒత్తిడి ఎక్కువైనప్పుడు, నిద్రలేమి కారణంగా, అధిక వెలుతురు, అధిక శబ్దాల వల్ల అలాగే కళ్లు, మెడ, వెన్ను భాగం ఎక్కువ ఒత్తిడికి గురి అవ్వడం వంటి తదితర కారణాల వల్ల తలనొప్పి వస్తుంటుంది. తలనొప్పి రాగానే చాలా మంది ఏవేవో మందులను వేసుకుంటూ ఉంటారు. ఈ మందులను ఉపయోగించడం వల్ల ఉపశమనం ఉన్నప్పటికీ వీటిని వాడడం వల్ల భవిష్యత్తుల్లో దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకే మందులను వేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఈ చిన్న అనారోగ్య సమస్యలు మందులకు తగ్గకుండా పెద్దగా అయ్యే అవకాశం ఉంది.
కాబట్టి ఇలాంటి చిన్న అనారోగ్య సమస్యలకు కూడా మందులను వాడకుండా ఇంటి చిట్కాలను ఉపయోగించి వాటిని నయం చేసుకోవాలి. తలనొప్పి సమస్య నుండి కూడా మన వంటింట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి బయటపడవచ్చు. తలనొప్పిని కేవలం 5 నిమిషాల్లోనే తగ్గించే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తలనొప్పితో బాధపడే వారు ముందుగా రెండు ఇంచుల అల్లం ముక్కను తీసుకుని దానిని శుభ్రపరిచి ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని, చిటికెడును వేసి ఉప్పును వేసి కలపాలి. తరువాత ఈ గిన్నెను ఎండ తగిలే ప్రాంతంలో 2 నుండి 3 గంటల పాటు ఉంచాలి. తరువాత ఈ అల్లం ముక్కలను తీసుకుని నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల కేవలం 5 నిమిషాల్లోనే తలనొప్పి తగ్గుతుంది.
ఈ విధంగా అల్లం ముక్కలను ముందుగానే తయారు చేసి ఫ్రిజ్ లో ఉంచి కూడా నిల్వ చేసుకోవచ్చు. ఇది అంతా చేసుకోవడానికి ఓపిక లేని వారు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ నిమ్మ రసాన్ని, ఒక టీ స్పూన్ అల్లం రసాన్ని వేసి కలిపి ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా తలనొప్పి తగ్గుతుంది. తలనొప్పితో బాధపడుతున్నప్పుడు ఈ చిట్కాను పాటించడం వల్ల తలనొప్పి నుండి చాలా తక్కువ సమయంలో ఉపశమనం లభిస్తుంది. ఈ చిట్కాలో తయారీలో మనం అన్నీ కూడా సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగిస్తాం. కాబట్టి మన శరీరానికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది.