Home Tips

మీ బాత్‌రూమ్ దుర్వాస‌న రాకుండా ఉండాలంటే.. ఈ చిట్కాను పాటించండి..!

పాత గ్రీటింగ్ కార్డుల్లో ఖాళీగా ఉన్న భాగాన్ని పిల్లలకు బొమ్మలు వేసుకునేందుకు ఇవ్వవచ్చు. పాత చెప్పులను కానీ, కొత్తవి కానీ, ఎప్పుడూ బట్టతో తుడవకూడదు.తుడవడం వలన షైనింగ్, పైన పొట్టు పోతుంది. స్పాంజీ ముక్కతోనే తుడవాలి. మంచి షైనింగ్ వస్తుంది. పైన పొట్టులా లేచిపోదు. పాత టర్కిష్ టవల్స్ వంటింట్లో చేయి తుడుచు కోవటానికి, చిన్న హ్యాండ్ టవల్స్‌గా కట్‌చేసి ఉపయోగించవచ్చు. చేనేత టవల్స్ అయితే గాజు సాసర్ల సైజులో రౌండ్‌గా కత్తిరించి సాసర్ల మధ్య వుంచితే గీతలు, దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంటాయి. పాత టాల్కం పౌడర్‌కు సువాసన తగ్గితే ఆ డబ్బాని కాసేపు ఎండలో ఉంచితే సువాసన తిరిగి పొందవచ్చు. పాత పేపర్లలో మిగిలిన పెద్దపెద్ద ముక్కలను షెల్ఫ్‌లలో పరిస్తే ఆకర్షణీయంగా ఉంటాయి. పాత బనియన్లు పారేయకుండా కడిగిన గాజు వస్తువులు తుడవడానికి ఉపయోగించవచ్చు. ఇవి తేమను బాగా పీల్చుకుంటాయి. అలాగే రేడియో, టివి వంటి సున్నితమైన పరికరాలు తుడవడానికి ఉపయోగపడతాయి.

పనిచేసే కాలం దాటిపోయిన టానిక్‌లను మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. పెన్సిల్ బ్యాటరీలు అయిపోవచ్చినట్లు అనిపిస్తే వాటి నెగిటివ్‌వైపు కొవ్వొత్తి మంటమీద అయిదు నిముషాలు ఉంచితే మరికొన్ని రోజులు పనిచేస్తాయి. ప్లవర్ వాజ్ లో సాల్ట్ కల్పిన నీరు పోస్తే ప్లవర్స్ ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయి. ప్లాస్టిక్ కంటైనర్‌కి పసుపు మరకలు అయితే సున్నిపిండి లేదా శనగ పిండితో రుద్దితే అవి మాయమవుతాయి. పసి పిల్లలకు స్నానం చేయించేటప్పుడు నీటిలో ఉప్పు, డెటాల్ కలిపితే చర్మ వ్యాధి నిరోధకంగా ఉపయోగపడుతుంది. పురుగు(చీడ)పట్టిన మొక్కలకు, పాదులకు ఇంగువ నీళ్ళు పోస్తే పురుగులు(చీడ)పోయి చక్కని కాపు కాస్తాయి. పువ్వులు వాడిపోయినట్లుగా ఉంటే వాటిని ఒక పాత న్యూస్ పేపరులో చుట్టి రాత్రంతా నీళ్ళ బకెట్‌లో వేస్తే తెల్లవారేసరికి తాజాగా ఉంటాయి. ఫోటోలను పోస్టులో పంపించదల్చుకున్నప్పుడు వాటి మధ్య కొంచెం టాల్కం పౌడర్ చల్లితే అవి అతుక్కోకుండా ఉంటాయి.

follow this tip if you want good smell from your bathroom

ఫ్లవర్ వాజ్ లో పూలు తాజాగా ఉండడానికి వాజ్ లో నీరు పోయడంతో పాటు పూల రెక్కలపైన, ఆకులపైన కూడా నీళ్లు చిలకరించాలి. ఫ్లవర్ వాజ్ లో పువ్వులు అమర్చేటప్పుడు ఒక్కోసారి వాటి కాడలు వంగిపోయి ఉంటాయి. అలాంటప్పుడు కాడల్ని సన్నగా చేసి స్ట్రాలో అమర్చి వాజ్ లో పెట్టుకుంటే సరి! రంగురంగుల స్ట్రాలైతే వాజ్ అందం మరింత ఇనుమడిస్తుంది. బేకింగ్ సోడాను కొద్దిగా ప్లేటులో వేసి బాత్ రూం లో పెడితే వాసన రాకుండా ఉంటుంది. బోరింగ్ నీటి వల్ల గాజు సామాగ్రి, టైల్స్ పై ఏర్పడే తెల్లని తెట్టులాంటి మరకలు పోవాలంటే దానిపై కొంచెం నిమ్మనూనె రాసి పొడి వస్త్రంతో తుడవాలి. బెలూన్లను కొన్ని నిముషాల పాటు వేడినీళ్ళలో ఉంచితే గాలి నింపడం తేలికవుతుంది. మీ చిన్నారులు తమ అలమరలు, పుస్తకాలు, బొమ్మలు, బూట్లు వగైరాలు శుభ్రం చేసేందుకు వీటిని ఇవ్వవచ్చు.

Admin

Recent Posts