Home Tips

సిల్క్ దుస్తుల‌ను ఇలా శుభ్రం చేయండి..!

సిల్క్ చీరలకి, డ్రస్సులకు అంటిన గ్రీజు, నూనె మరకలు వదిలించడానికి వాటిని ఒక బకెట్ నీళ్ళలో కొన్ని చుక్కలు షాంపూ వేసి నానబెట్టండి. కాసేపటి తరువాత ఉతికితే మరకలు మాయమవుతాయి. బట్టలకు తారు అంటితే, తారు తొలగించి, తరువాత మరక ఉన్న చోట యూకలిప్టస్ నూనెతో రుద్దితే మరక పోతుంది. బట్టలకు అంటిన చూయింగ్ గమ్‌ను గంజిపొడితో రుద్ది తొలగించవచ్చు. లేదా గమ్‌ ఉన్న చోట పైన పేపర్‌వేసి వేడిగా ఉన్న ఇస్త్రీపెట్టెను పైనపెడితే పేపర్‌కు అంటుకొని గమ్‌ వదిలిపోతుంది.

నూనె మరకలు పడితే కొంచెం పెట్రోలుతో రుద్ది పోగొట్టవచ్చు. ఉన్ని బట్టల మీద కూర మరకలైతే ఒక టవల్ అంచుని పెర్‌ఫ్యూమ్‌లో గాని, కిరోసిన్‌లో గాని ముంచి ఆ మరక పోయే వరకు రుద్దాలి. మరకలు పోవటంతో పాటు బట్టలు సువాసనను సంతరించుకుంటాయి. బట్టలమీద తుప్పు మరకలైతే, వాటిపై నిమ్మరసం పట్టించి ఆవిరిమీద పెట్టాలి. తుప్పు మరకలు మాయం.

how to wash your silk clothes

డ్రస్సులకు ఉన్న లేస్‌లు మురికి పట్టి అసహ్యంగా ఉంటే సబ్బు కలిపిన నీటిలో కొంచెంసేపు నానబెట్టి తరువాత మృదువుగా ఉతకాలి. ఎప్పుడైనా బట్టల మీద ఇండియన్ ఇంక్ గానీ, పెయింట్స్ గానీ పడ్డాయంటే వెంటనే నీళ్ళలో కొద్దిగా కిరసనాయిలు వేసి ఆ బట్టలను ఒక రోజు పూర్తిగా నానబెట్టి ఉతకండి. ఆ పడిన వాటితో సహా, ఆ బట్టలుకు ఉన్న కుళ్ళు కూడా వదలిపోయి క్రొత్త బట్టల్లా శుభ్రపడతాయి.

Admin

Recent Posts