Home Tips

మీ బట్టలకు అంటున్న చూయింగ్ గమ్ ను ఇలా సింపుల్ గా తొలగించుకోండి.

మీ బట్టలకు ఎప్పుడైనా నమిలి పడేసిన చూయింగ్ గమ్ అంటుకుందా? దానిని తొలగించడానికి నానా అవస్థలు పడ్డారు కదా.! ఆ బాధ వర్ణనాతీయం…కాస్ట్లీ ప్యాంట్ పాడైపోతుందనే బాధ ఓ వైపు, చూయింగ్ గమ్ ను తొలగిస్తుంటే అది చేతికి అంటుకుంటున్న చికాకు ఒకవైపు! ఇక ఈ సారి అటువంటి బాధ అక్కర్లేదు…ఈ సింపుల్ చిట్కా ద్వారా మీ బట్టలకు అంటుకున్న చూయింగ్ గమ్ ను ఈజీగా తొలగించేసుకోండి.

మొదటగా చూయింగ్ గమ్ అంటిన ప్రాంతాన్ని… హెయిర్ డ్రయ్యర్ సహాయంతో వేడి చేయాలి. ఇలా వేడి కాగానే…చూయింగ్ గమ్ కాస్త లిక్విడ్ స్టేజ్ లోకి వస్తుంది. ఆ సమయంలో ఓ ప్లాస్టిక్ కత్తి( బర్త్ డే లకు కేక్ కట్ చేసే నైఫ్) తో వచ్చినంత వరకు చూయింగ్ ను తొలగించాలి, తర్వాత మిగిలిన చూయింగమ్ పై BENGOY (పెయిన్ రిలీవింగ్ జెల్) ను వేసి….ఆ ప్రాంతాన్ని బాగా రుద్దాలి. తర్వాత చేతికి ఓ ఫ్లాస్టిక్ కవర్ ను తొడిగి….ఆ ప్రాంతాన్నంత శుభ్రం చేయాలి….చూయింగ్ గమ్ అంటిన మరక కూడా లేకుండా ఆ ప్రాంతమంతా….క్లీన్ అయిపోతుంది.

if chewing gum stuck to clothes remove it like this

మరో పద్దతిలో …ఓ ఐస్ ముక్కను తీసుకొని చూయింగ్ గమ్ మీద అలాగే రుద్దుతూ పోతే..అది గడ్డ కడుతుంది. అప్పుడు చూయింగ్ గమ్ ను సింపుల్ గా తీసోయొచ్చు..అయితే కాస్ట్లీ కాస్ట్యూమ్స్ విషయంలో మాత్రం పై చిట్కానే అత్యుత్తమ మైనది.

Admin

Recent Posts