హెల్త్ టిప్స్

రోజుకో అరటిపండును త‌ప్ప‌నిస‌రిగా తినండి.. ఎందుకో తెలుసా..?

నగరాల్లో జీవించే మహిళలు అదీ వర్కింగ్ ఉమెన్‌ చాలా బిజీ బిజీగా ఆహారం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపక ఏదో ఆహారం తిన్నామని తిని ఉద్యోగాలకు వెళ్తుంటారు. ఇలాంటి వారు.. ప్రతిరోజు అన్నీ రకాల పండ్లను తినకపోయినా అరటిపండును రోజుకు ఒకటి చొప్పున తింటే ఆరోగ్యానికి కావలసిన పోషక పదార్థాలు లభిస్తాయి.

అరటి పండులో బి5, బి3, బి6 మాంసకృత్తులు పొటాషియం బయోటిన్, మాంగనీస్ వంటి పదార్థాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మీతో పాటు మీ పిల్లలకీ ఈ అరటి పండును నేరుగా ఇవ్వకుండా వారికి నచ్చే విధంగా తయారు చేసి ఇవ్వండి. ఐస్‌క్రీమ్‌‌లపై బాదం, జీడిపప్పు ముక్కలను వేసి అందులో ఈ అరటి పండు ముక్కలను కూడా చిన్నవిగా తరిగి వేసి ఇవ్వండి. బ్రెడ్‌లపై సాస్‌వేసే ముందు అరటి పండు ముక్కల్ని వేసి వాటిపై సాస్‌, జీడిపప్పు, బాదం పప్పులను వేసి ఇవ్వండి.

you must take daily one banana know why

ఇలా అరటి పండును నేరుగా కాకుండా వేరే విధంగా ఇచ్చినా తగిన పోషకాలు అందుతాయి. ఇలా కాకుండా పండిన అరటి పండును తీసుకుని మెత్తగా చేసుకుని అందులో కిసిమిస్, సన్నగా తరిగిన ఖర్జూరాలు, బాదంపప్పులను కలిపి ఈ మిశ్రమాన్ని బిస్కెట్లు, బ్రెడ్ స్లైసులపై వేసి పిల్లలకు ఇస్తే మారాం చేయకుండా తింటారు. ప్రతిరోజు మహిళలు నిద్రపోవడానికి ముందు ఒక గ్లాసుడు పాలు, ఒక అరటిపండును తినడంతో పోషక పదార్థాలు అందుతాయని వైద్యులు సూచిస్తున్నారు.

Admin

Recent Posts