information

Indian Currency : రూ.10, రూ.100, రూ.2000.. ఇలా ఒక్కో క‌రెన్సీ నోటు ప్రింటింగ్‌కు.. ఎంత ఖ‌ర్చ‌వుతుందో తెలుసా ?

Indian Currency : ప్ర‌స్తుతం మ‌న‌కు అనేక ర‌కాల క‌రెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయి. రూ.1 మొద‌లుకొని రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2000 నోట్లు అందుబాటులో ఉన్నాయి. గ‌తంలో రూ.1000 ఉండేవి, కానీ వాటిని ర‌ద్దు చేసి రూ.2000 నోట్ల‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ నోట్ల‌ను త‌యారు చేసేందుకు ఖ‌ర్చు ఎంత‌వుతుందో తెలుసా ? ఆ వివ‌రాల‌నే ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.10 నోటు త‌యారు చేసేందుకు రూ.1.01 ఖ‌ర్చు అవుతుంది. రూ.20 నోటు ప్రింటింగ్‌కు రూ.1, రూ.50 నోటు ప్రింటింగ్‌కు రూ.1.01 ఖ‌ర్చు అవుతుంది. ఇక రూ.100 నోటు ప్రింటింగ్‌కు రూ.1.51 ఖ‌ర్చు అవుతుంది. రూ.200 నోటుకు రూ.2.93, రూ.500 నోటుకు రూ.2.94, రూ.2000 నోటు ప్రింటింగ్‌కు రూ.3.54 ఖ‌ర్చ‌వుతుంది.

how much is the printing cost for these notes

ఇక రూ.1 నోటు ప్రింటింగ్‌కు రూ.1.14 ఖ‌ర్చ‌వుతోంది. అందుక‌నే ఈ నోటును పెద్ద మొత్తంలో ప్రింట్ చేయ‌డం లేదు. రూ.2 నోట్లు అస‌లు కనిపించ‌డం లేదు. రూ.5 నోటు ప్రింటింగ్‌కు రూ.0.96 మేర ఖ‌ర్చవుతోంది.

గ‌మ‌నిక‌: మార్చి 2021లో వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ రేట్లు ఉన్నాయి.

Admin

Recent Posts