information

Car Insurance : వ‌ర‌ద‌ల్లో కారు దెబ్బ తింటే..? ఇన్సూరెన్స్‌ను ఎలా ఉప‌యోగించుకోవాలి..?

Car Insurance : చాలామంది, డబ్బులు దాచుకుని వాహనాన్ని ఇష్టంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. లేదంటే లోన్ పెట్టి వాహనాన్ని, కొంటూ ఉంటారు. అయితే, ఒకవేళ కనుక వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగినా, లేదంటే ఇబ్బంది కలిగినా బీమా ఇస్తారు. వాహనం వరదలు వలన, దెబ్బతిన్న సందర్భంలో కష్టపడి సంపాదించిన డబ్బుని పోగొట్టుకోకుండా ఉండాలంటే, సరైన కారు బీమా కవరేజీని కలిగి ఉండడం చాలా అవసరం. వాహనదారులు కచ్చితంగా ఈ విషయాన్ని గుర్తించాలి.

కారు వరదల ప్రమాదాల బారిన పడ్డా, ఇబ్బంది లేకుండా ఉండాలంటే, తగిన కారు బీమా ని కలిగి ఉండడం ద్వారా ఆర్థిక స్థితిని కాపాడుకోవడానికి, మీరు చర్యలు తీసుకోవచ్చు. బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఫలితంగా కారు నష్టానికి ఇంత కవరేజీ అందించేలా చూసుకోండి. మీ వాహనానికి వరద సంబంధిత నష్టాల కారణంగా సంభవించే ఆర్థిక నష్టాలను తగ్గించుకోవచ్చు. భద్రత ఉంటుంది.

how to claim insurance if your car has been hit by floods

పాలసీని తీసుకునేటప్పుడు, పాలసీ వివరాలను క్లియర్ గా తెలుసుకోండి. ఏమైనా సందేహాలు ఉంటే, వెంటనే క్లియర్ చేసుకోండి. ఎటువంటి వాటిని పాలసీ కవర్ చేస్తుంది, ఎంత వస్తుంది..? ఇటువంటివన్నీ కూడా మీరు ముందే తెలుసుకోవాలి. ఒకవేళ కనుక వాహనం వరదలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాల వలన దెబ్బతింటే, కచ్చితంగా మీరు బీమా ద్వారా నష్టపోకుండా ఉండేటట్టు ముందుగానే చూసుకోండి.

కారు బీమా కేవలం ఆర్థిక బాధ్యత మాత్రమే కాదు. వరదలు వంటి ఊహించని సంఘటన నుండి కూడా రక్షణని ఇస్తుంది. ఒకవేళ అలా రక్షణ ఉంటే మనశ్శాంతి కూడా ఉంటుంది. వరదలు వంటివి సంభవించినప్పుడు, వాహనాలు పాడైపోవడం లేదంటే ఏమైనా అవ్వడం వంటివి జరిగినప్పుడు, ఆందోళన చెందక్కర్లేదు. హాయిగా గుండెల మీద చేయి వేసుకొని కూర్చోవచ్చు.

Admin

Recent Posts