information

Torn Currency Notes : మీవ‌ద్ద చిరిగిన లేదా పాడైన‌, మ‌ర‌క‌లు అంటిన నోట్లు ఉన్నాయా..? వాటిని ఇలా మార్చుకోండి..!

Torn Currency Notes : అంద‌రూ అన్ని వ‌స్తువుల‌ను జాగ్ర‌త్త‌గా పెట్టుకోలేరు. కొన్ని ర‌కాల వ‌స్తువులు అప్పుడ‌ప్పుడు ప‌లు కార‌ణాల వ‌ల్ల డ్యామేజ్ అవుతుంటాయి. అలాగే క‌రెన్సీ నోట్లు కూడా కొన్ని కార‌ణాల వ‌ల్ల చిరిగిపోతుంటాయి. ఇక కొన్ని నోట్లు అయితే మురికి లేదా మ‌ర‌క‌లు అంటుకుంటాయి. కొన్ని నోట్ల‌పై రాత‌లు రాస్తారు. ఇలా అనేక ర‌కాల కార‌ణాల వ‌ల్ల నోట్లు డ్యామేజ్ అవుతుంటాయి. అయితే మీ వ‌ద్ద కూడా ఇలాంటి నోట్లు ఉంటే మీరు దిగులు ప‌డాల్సిన ప‌నిలేదు. వాటిని మీరు ఎంచ‌క్కా మార్చుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ వ‌ద్ద చిరిగిన లేదా పాడైపోయిన‌, మ‌ర‌క‌లు అంటిన క‌రెన్సీ నోట్లు ఉంటే వాటిని మీరు మీకు స‌మీపంలోని ఆర్‌బీఐ శాఖ కార్యాల‌యం లేదా మీకు స‌మీపంలోని ఏదైనా బ్యాంకులో మార్చుకోవ‌చ్చు. అయితే క‌రెన్సీ నోట్ల‌ను ఇలా మార్పిడి చేసేందుకు బ్యాంకులు కొంత రుసుము వ‌సూలు చేస్తాయి. సాధార‌ణంగా అలాంటి క‌రెన్సీ నోట్ల విలువ రూ.5వేల వ‌ర‌కు ఉండి నోట్లు 20 వ‌ర‌కు ఉంటే వాటిని ఎలాంటి రుసుము చెల్లించ‌కుండానే ఉచితంగానే బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవ‌చ్చు. అలాగే 20 నోట్ల క‌న్నా ఎక్కువ ఉండి వాటి విలువ రూ.5వేల‌కు మించితే మాత్రం బ్యాంకులు కొంత రుసుము వ‌సూలు చేసి ఆ నోట్ల‌ను మార్పిడి చేస్తాయి.

if you have torn currency notes then exchange them like this

ఇక అలాంటి నోట్ల విలువ రూ.50వేల‌కు మించితే మాత్రం బ్యాంకులు కాస్త జాగ్ర‌త్త తీసుకుంటాయి. మీ వివ‌రాల‌ను పూర్తిగా న‌మోదు చేసి కొంత ఎక్కువ రుసుముతో ఆ నోట్ల‌ను మార్పిడి చేస్తాయి. అయితే మీరు అలాంటి నోట్ల‌ను బ్యాంకుల్లో రోజుకు 20 నోట్ల వ‌ర‌కు మాత్ర‌మే మార్పిడి చేసుకోవ‌చ్చు. అలాగే వాటి విలువ రూ.5వేలు లేదా అంత‌కు లోపు ఉండాలి. అంత‌క‌న్నా ఎక్కువ ఉంటే మ‌రుస‌టి రోజు మార్పిడి చేసుకోవాలి. ఇలా మీ వ‌ద్ద ఉన్న చిరిగిన నోట్ల‌ను మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే మీ వద్ద ఉన్న అలాంటి క‌రెన్సీ నోట్ల‌ను బ్యాంకులు గ‌న‌క తీసుకోక‌పోతే అప్పుడు మీరు ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి మీరు అందులో మీ ఫిర్యాదును న‌మోదు చేయ‌వ‌చ్చు. లేదా ఆర్‌బీఐకి కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. దీంతో బ్యాంకుపై ఆర్‌బీఐ వారు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటారు.

Admin

Recent Posts