information

Gold : బంగారు ఆభ‌ర‌ణాల‌ను తాక‌ట్టు పెట్టిన‌ప్పుడు చేయ‌వ‌ల‌సిన ప‌నులు..!

Gold : కొంతమంది బంగారు ఆభరణాలని తాకట్టు పెడుతూ ఉంటారు. బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టేటప్పుడు, కొన్ని పనులను కచ్చితంగా చేయాలి. మరి బంగారు ఆభరణాలని తాకట్టు పెట్టినప్పుడు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాన్ని చూద్దాం. లక్ష్మీ స్వరూపమైన బంగారాన్ని తాకట్టు పెట్టేటప్పుడు, ప్రతి శుక్రవారం ఇంటి యజమాని లేదంటే ఆయన భార్య లక్ష్మీదేవిని పూజించాలి. బంగారు ఆభరణాలను ఎప్పుడైనా తాకట్టు పెట్టాలని అనుకుంటే, దానికి ముందు మీరు లక్ష్మీదేవిని క్షమాపణ అడగండి.

బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టే దుకాణంలో ఇచ్చే ముందు, లక్ష్మీదేవి తిరిగి ఇంటికి రావాలని మీరు కోరుకోవాలి. అలా చేయడం వలన లక్ష్మీదేవి మళ్ళీ వస్తుంది. లక్ష్మీదేవికి కోపం రాదు. అలానే మీరు బంగారు ఆభరణాలని తాకట్టు నుండి తిరిగి తీసుకునే సమయంలో, లక్ష్మీదేవి తిరిగి వస్తున్నందున లక్ష్మీ దేవికి మళ్లీ నమస్కారం చేసుకోండి. బంగారు ఆభరణాలని తాకట్టు పెట్టి, వచ్చిన ఆ డబ్బు తో అనవసరమైన ఖర్చు చేయకూడదు.

important tips to follow if you are borrowing money from gold

ఆ ధనాన్ని అసలు దుర్వినియోగం చేయకండి. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. మీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది. బంగారు ఆభరణాలని విడిపించిన వెంటనే పూజ గదిలో అమ్మవారికి చూపించాక, ఆ తర్వాత వాటిని భద్రపరుచుకోవాలి. బంగారు అభరణాలని తాకట్టు పెడితే వచ్చిన ధనం ధనలక్ష్మి స్వరూపం. వాటిని కోరికలు తీర్చడానికి, అనవసర ఖర్చులకి వాడొద్దు.

వాటిని అత్యవసరాల కోసం మాత్రమే వాడండి. చూసారు కదా బంగారు ఆభరణాలని తాకట్టు పెట్టేటప్పుడు, తాకట్టు నుండి విడిపించుకునేటప్పుడు ఎటువంటి పద్ధతుల్ని పాటించాలి..? ఎటువంటి తప్పులను చేయకూడదని.. మరి అస్సలు ఇటువంటి తప్పులు చేయకుండా చూసుకోండి. అప్పుడు లక్ష్మీదేవికి ఎటువంటి కోపం రాదు. మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. లేదంటే అనవసరంగా లక్ష్మీదేవి కి మీ పై ఆగ్రహం కలిగి, మీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది.

Share
Admin

Recent Posts