సాధారణంగా మనం ట్రైన్ లో ట్రావెల్ చేయాలంటే టికెట్ ఉంటే సరిపోతుంది. ఏదైనా రైల్వేస్టేషన్ కి వెళ్తే ప్లాట్ ఫార్మ్ టికెట్ లేదా ట్రైన్ టికెట్ ఉంటే సరిపోతుంది. కానీ ఈ రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే మాత్రం పాస్ పోర్ట్, వీసా కావాల్సి ఉంటుంది. అదేంటి పాస్ పోర్ట్, వీసా కూడా రైల్వే స్టేషన్ కి అవసరమా అని ఆశ్చర్యపోతున్నారా..? అట్టారి రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే కచ్చితంగా ఈ రెండు ఉండాలి. సంజహుతా ఎక్స్‌ప్రెస్ ఎక్కే వాళ్ళు పాస్ పోర్ట్, వీసాను కలిగి ఉండాలి. ఇది ఇండియా పాకిస్తాన్ మధ్య ప్రయాణిస్తుంది.
సాధారణంగా ఏ రైల్వే స్టేషన్ కి వెళ్లాలన్నా మనం ప్లాట్ ఫారం టికెట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడికి మాత్రం పాస్ పోర్ట్, వీసాతో వెళ్లాలి. ఇంటర్నేషనల్ ఫ్లైట్లకి ఎలా అయితే పాస్ పోర్ట్, వీసా ముఖ్యమో ఈ రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే కూడా అంతే. అమృత్సర్ జిల్లాలో అటారి శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్ ఉంది. ఇది పాకిస్తాన్ ఇండియా కి మధ్య రైలు నడుపుతుంది.
మిలిటరీ సెక్యూరిటీ ఈ రైల్వే స్టేషన్ లో ఎక్కువ ఉంటుంది. ప్యాసింజర్లను కేవలం వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పాస్పోర్ట్, వీసాలని చెక్ చేసిన తర్వాత మాత్రమే పంపిస్తారు. ఇప్పుడు ఇక్కడి నుంచి కేవలం నాలుగు రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఒకటి సంజహుతా ఎక్స్ప్రెస్. ఇది వారానికి రెండు సార్లు మాత్రమే ప్రయాణం చేస్తుంది. ఢిల్లీ నుంచే బయలుదేరుతుంది. ఈ రైల్వే స్టేషన్లో మొత్తం మూడు ఫ్లాట్ ఫామ్ లు ఉన్నాయి.