సాధారణంగా మన ఇళ్ళలో లాఫింగ్ బుద్ధ పెట్టుకోవాలంటే ఎంతో మంది ఆలోచిస్తారు. ఇంట్లో పెట్టుకోవడం మంచిదా?కాదా? అనే సందేహం చాలా మందికి కలుగుతుంటాయి.అయితే వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏవిధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధ మన ఇంట్లో ఉండటం ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.అయితే ఒక్కో విధమైన బొమ్మని ఇంట్లో ఉండటం వల్ల ఒక్కో రకమైన ఫలితాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. లాఫింగ్ బుద్ధ బొమ్మ చేతిలో బంగారు బంతుల్ని ఎత్తుకున్నటువంటి బొమ్మ ఇంట్లో ఉంటే మన కుటుంబ సభ్యులు ఆరోగ్యంతో ఉంటారు. బంగారు నాణాల పై కూర్చున్నటువంటి బొమ్మ ఉంటే మన ఇంట్లో సంపదకు కొదువ ఉండదు.
తాబేలు పై కూర్చున్న టువంటి విగ్రహం ఉంటే మన జీవితం ఎంతో విజయవంతంగా సాగిపోతుంది. క్రిస్టల్ తో తయారు చేసిన విగ్రహం ఇంట్లో ఉంటే జ్ఞానం పెరుగుతుంది. లాఫింగ్ బుద్ధ అంటే బుద్ధుడికి ప్రతీక కనుక ఈ విగ్రహాన్ని మన ఇంట్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా పెట్టడం వల్ల మన ఇంట్లోకి వచ్చిన వారు చిరునవ్వుతో అడుగు పెడతారు.అదేవిధంగా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడూ నవ్వుతూ ఎంతో సంతోషంగా గడుపుతారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.