information

ఏడు వారాల నగలు అంటే ఏంటి? వాటి వెనుక ఉన్న సీక్రెట్ ఇదే!

<p style&equals;"text-align&colon; justify&semi;">మన పెద్దవాళ్ళు అప్పుడప్పుడు మా బామ్మకి ఏడు వారాల నగలుండేవట అని అంటుంటేనో&comma; సినిమాలో మా అత్తగారు పెళ్ళైన కొత్తల్లో నాకు ఇచ్చిన ఏడు వారాల నగలు అని కోడళ్ళకు చూపిస్తుంటేనో ఈ ఏడు వారాల నగల గురించి వింటూ ఉంటాం&period; అయితే ఈ జనరేషన్ కే కాదు అమ్మల జనరేషన్ లో కూడా చాలామందికి ఈ ఏడు వారాల నగల గురించి బహుశా తెలియకపోవచ్చు&period; ఎందుకంటే చాలా ఏళ్ళ నుండి ట్రెండ్ కి తగ్గట్టు డ్రెస్సింగ్&comma; జ్యువెలరీ ధరించడంలో మార్పులు వచ్చేశాయి&period; అయినప్పటికీ ఈ ఏడు వారాల నగలు ఎలా ఉంటాయో చూడకపోయినా కనీసం తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం ఉండే ఉంటుంది&period; మరి ఇప్పుడు మనం ఏడు వారాల నగలు అని ఎందుకంటారో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో గ్రహాల అనుకూలం కోసం వాడుతున్న రాళ్ళ ఉంగరాలు మాదిరిగా పూర్వం బంగారు నగలు ధరించేవారు&period; ఈ బంగారు ఆభరణాలను స్త్రీలు వారం రోజులూ ఒక్కో రోజు ఒక్కో గ్రహం అనుగ్రహం కోసం&comma; ఆరోగ్యం కోసం ధరించే వారు&period; వాటినే ఏడువారాల నగలు అనే వారు&period; ఏయే రోజు ఎలాంటి నగలు ధరించేవారో వివరంగా ఉంది&period; ఆదివారం సూర్యుని అనుగ్రహం కోసం కెంపులతో డిజైన్ చేసిన కమ్మలు&comma; హారాలు మొదలైనవి ధరించేవారు&period; సోమవారం చంద్రుని అనుగ్రహం కోసం ముత్యాల హారాలు&comma; ముత్యాల గాజులు ఇలా ముత్యాలతో చేసిన ఆభరణాలు ధరించేవారు&period; మంగళవారం కుజుని అనుగ్రహం కోసం పగడాల గొలుసులు&comma; పగడాల ఉంగరాలు వంటి నగలు ధరించేవారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85953 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;7-weeks-jewellery&period;jpg" alt&equals;"what is 7 weeks jewellery and what is its speciality " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బుధవారం బుధుని అనుగ్రహం కోసం పచ్చల పతకాలు&comma; పచ్చలు అమర్చిన గాజులు తొడిగేవారు&period; గురువారం బృహస్పతి అనుగ్రహం కోసం పుష్యరాగము ఉన్న కమ్మలు&comma; ఉంగరాలు మొదలైనవి ధరించేవారు&period; శుక్రవారం శుక్రుని అనుగ్రహం కోసం వజ్రాల హారాలు&comma; వజ్రపు ముక్కుపుడక&comma; వజ్రాలు ఉన్న కమ్మలు మొదలైనవి ధరించేవారు&period; శనివారం శనిదేవుని అనుగ్రహం కోసం నీలమణి హారాలు మొదలైనవి వేసుకునేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏడు వారాల నగలు ఏడు రోజులు ధరించిన స్త్రీలకు సంపూర్ణ ఆయురారోగ్యాలు&comma; అప్లైశ్వర్యాలు సిద్దించేలా గ్రహాల అనుకూలత ఉంటుందని మన పూర్వీకులు భావించేవారు&period; ఆ కాలంలో మన దేశంలో వజ్ర&comma; కనక&comma; వైడూర్యాలు చాలా చౌకగా లభించేవట&period; అందుకే పేద ధనిక అనే తేడా లేకుండా స్త్రీలంతా తమ తాహతకు తగినట్టు ఏడు వారాల నగలు చేయించుకునేవారట&period; ధనికులైతే ఎక్కువ డిజైన్లలో ఎక్కువ నగలు ఆభరణాలు చేయించుకునేవారు&period; పేదవారైతే ఒక్కోరోజుకి ఒక్కో సెట్ ఉండేలా నగలు చేయించుకునేవారని పెద్దలు చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts