Off Beat

చీమ ఎంత ఎత్తు నుంచి కింద పడినా దానికి దెబ్బ తగలదు.. ఎందుకని?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక వస్తువు కింద పడినప్పుడు పగిలిపోవడానికి&comma; జీవులకు దెబ్బ తగలడానికి కారణం ఒకటే&comma; పడడానికి ముందు&comma; పడిన తర్వాత వాటి ద్రవ్యవేగం లో మార్పే&period; ద్రవ్యవేగం అంటే ఆ వస్తువులో ద్రవ్యరాశి&comma; దాని వేగాలను గుణిస్తే వచ్చేదే&period; ఎత్తు నుంచి కిందకి పడే వస్తువు ద్రవ్యవేగం అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది&period; ఆ వస్తువు భూమిని తాకగానే అంతటి వేగమూ శూన్యం కావడం వల్ల&comma; అంతే ద్రవ్యవేగంతో సమానమైన శక్తి ఏర్పడి ఆ వస్తువుపై వ్యతిరేక దిశలో పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదాహరణకు ఒక వస్తువు 20 మీటర్ల ఎత్తు నుంచి పడిపోతూ 2 సెకన్లలో నేలను తాకిందనుకుందాం&period; ఈ ప్రయాణంలో అది సుమారు గంటకు 72 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది&period; ఆ వేగాన్ని&comma; దాని ద్రవ్యరాశితో గుణిస్తే దానిలో ఏర్పడే ద్రవ్యవేగం తెలుస్తుంది&period; చీమల ద్రవ్యరాశి చాలా తక్కువ కావడం వల్ల తక్కువ ద్రవ్యవేగంలోనే అవి కింద పడతాయి&period; అంటే కింద పడిన చీమపై కలిగే శక్తి ప్రభావం కూడా తక్కువే&period; మనుషుల్లాంటి బరువైన జీవులు కింద పడితే ద్రవ్యవేగం ప్రభావం ఎక్కువై గాయాలు ఏర్పడుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85957 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;ants&period;jpg" alt&equals;"why ants will not get any injuries if they fell down " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేవలం ఆధునిక మానవుడు మాత్రమే పళ్లు తోముకుంటున్నాడు&period; నాగరికత నేర్చిన మానవుడు పళ్లు తోముకోడానికి కేవలం సూక్ష్మక్రిముల నిర్మూలనే కారణం కాదు&period; ఇది సౌందర్యపరమైన అంశం కూడా&period; సంఘజీవులైన మనుషులు చనువుగా&comma; దగ్గరగా మాట్లాడుకుంటూ ఉంటారు&period; అప్పుడు దుర్వాసన ఒక సమస్యగా మారుతుంది&period; పళ్ల మధ్యలో చిక్కుకున్న ఆహారపు అణువులపై సూక్ష్మక్రిములు ఏర్పడ్డం వల్ల దుర్వాసనే కాదు&comma; దంతాలు కూడా పాడవుతాయి&period; ఇక మనుషులు తినేంత వైవిధ్యభరితమైన ఆహారపు అలవాట్లు జంతువులకు లేవు&period; శాకాహార జంతువులు పీచు బాగా ఉండే ఆకులు&comma; గడ్డి మేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొక్కల రసాలు వాటి దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి&period; దంతాల మధ్య&comma; చిగుళ్ళ మీద సూక్ష్మజీవులు చేరకుండా వాటిని సంహరించగలిగిన రసాయనాలు జంతువులు తినే గడ్డి &comma; ఇతర వృక్షపదార్ధాల ద్వారా సమకూరుతాయి&period; శాఖాహార జంతువుల‌ పళ్లు దగ్గరగా&comma; పెద్దగా ఉంటాయి&period; మాంసాహార జంతువుల పళ్ల మధ్య ఎడం బాగా ఉంటుంది&period; జంతువుల నాలుకలు పొడవుగా&comma; గరుకుగా ఉంటాయి&period; వాటితో అవి పళ్లను పదే పదే నాకుతూ శుభ్రం చేసుకోగలుగుతాయి&period; అలాగే వాటి లాలాజలంలోని లవణీయత&comma; జిహ్వస్రావాల లాంటివి కూడా దంతక్షయం కాకుండా కాపాడుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts