information

లాక‌ర్‌లో ఉన్న డ‌బ్బు లేదా న‌గ‌లు పోతే ఎవ‌రు బాధ్య‌త వ‌హించాలి..?

బ్యాంకులో దొంగతనం జరిగి లాకర్‌లలో ఉన్నవి దోచుకుపోతే వినియోగదారులు నష్టపోతారు కదా? ఇలాంటి ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి వినియోగదారులు లాకర్ తీసుకునేప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఏదైనా బ్యాంకులో దొంగతనం, అగ్నిప్రమాదం జరిగి ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం, అలాగే లాకర్​లో దాచి పెట్టుకున్న బంగారం, నగదును నష్టపోతుంటారు. మరి బ్యాంకులు వేటికి బాధ్యత వహిస్తాయి? లాకర్​లో ఉన్న వస్తువులు పోతే పరిహారం అందిస్తాయా? ఈ విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్‌బీఐ నిబంధనలు ప్రకారం: ఏదైనా బ్యాంకులో దొంగతనం, అగ్నిప్రమాదం జరిగి ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారానికి నష్టం జరిగితే బ్యాంకు ఇచ్చే పత్రాల ద్వారా (అప్రైజర్‌ విలువ కట్టిన పత్రాలు) వంద శాతం బీమా సౌకర్యం అందుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధర ప్రకారం వాటికి బ్యాంక్​లు పరిహారాన్ని చెల్లిస్తాయి.

ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక బ్యాంక్​లో 40 గ్రాముల బంగారంపై రూ.2 లక్షల అప్పు తీసుకున్నారు. సదరు బ్యాంకులో దొంగతనం జరిగి ఆ వ్యక్తి పెట్టిన 40 గ్రాములు దొంగతనానికి గురైందనుకుంటే అతడి వద్ద ఉన్న పత్రాల ఆధారంగా 40 గ్రాముల బంగారానికి సంబంధించిన మొత్తం బ్యాంకు ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం చెల్లిస్తుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి శాఖకు సంవత్సరానికోసారి బీమా సౌకర్యం చేయిస్తారు. అది బ్యాంకు ఆ సంవత్సరంలో జరిపిన రుణ లావాదేవీలతో పాటు నగదుపై ఆధారపడి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారానికి ఎలాంటి ఢోకా ఉండదని బ్యాంకర్లు చెబుతున్నారు.

who is responsible if gold and money in locker lost

వ్యక్తిగత లాకర్లలోని సొమ్ముకు ఖాతాదారులదే బాధ్యత : వ్యక్తిగత లాకర్లలో పెట్టే విలువైన నగలు, పత్రాలు, నగదు విషయంలో ప్రమాదాన్ని మాత్రం ఖాతాదారులే భరించాలి. లాకర్లలో ఖాతాదారులు ఏం పెడుతున్నారనేది బ్యాంకు అధికారులు చూడరు. ఏదైనా ప్రమాదం జరిగి లాకర్లలో ఉన్న విలువైన నగదు, నగలు నష్టపోతే దానికి బ్యాంకు బాధ్యత వహించదు.

వ్యక్తిగత లాకర్లలో పెద్ద మొత్తంలో నగదు, నగలు పెట్టకపోవడమే మంచిది. ఏదైనా ప్రమాదం జరిగితే మనం బాధ్యత వహించాలి తప్పితే బ్యాంకులకు సంబంధం ఉండదు.

Admin