lifestyle

మిల‌ట‌రీ హోట‌ల్ అంటే ఏమిటి..? ఇత‌ర హోట‌ల్‌కు, దానికి తేడా ఏమిటి..?

మిలటరీ భోజనం అంటే ఏమిటి? . అక్కడ మిలటరీ వంటలు ఉంటాయా? . లేక, మిలటరీ వాళ్ళు ఓనర్ గా ఉంటారా? . మిలటరీలో వంటలు వండిన వాళ్ళు వంటలు చేస్తారా ? . అసలు మిలటరీ హోటల్ అంటే ఏమిటి ? అంటే.. పూర్వం అనగా 1990 వరకు ఇంటి బయట తినాలి అంటే కాఫీ హోటల్ – అనగా కాఫీ, టీ మరియు అల్పాహారం లభించేది. ఉదాహరణకు విజయవాడలో బాబాయ్ హోటల్. బ్రాహ్మణ భోజన హోటల్ – శాఖాహార భోజనం లభించేది. గుంటూరు లోని ఆనంద భవన్ ఇప్పుడు కూడా పూర్వ పద్దతి లోనే నడుపుతున్నారు.

స్టూడెంట్స్ మెస్- ఇక్కడ శాఖాహార భోజనం, ఆమ్లెట్ ఉండేవి. ఆదివారం కోడి కూర వడ్డించే వారు. ఇవి ఎక్కువ కాలేజీ విద్యార్థులు కోసం వుండేవి. రెండు పూటలు భోజనం పెట్టె వారు. నెలవారీ కార్డులు కూడా ఇచ్చే వారు. టిఫిన్, కాఫీ వుండేవి కావు. మిలిటరీ భోజన హోటల్ – మాంసాహార భోజనం లభించింది. ఇక్కడ శాఖాహార భోజనంతో కోడి కూర, పోటేలు మాంసం, చేపల పులుసు, కోడి గుడ్డు కూర, వగైరా వుండేవి. వీటికి అదనపు డబ్బు కట్టాలి. కొన్ని ప్రదేశాల్లో పలావు కూడా వుండేది. ఇవి దాదాపు కనుమరుగు అయ్యాయి. అప్పల రాజు మిలిటరీ భోజన హోటల్ లా వుండేవి.

do you know what is military hotel and its features

కాలక్రమేణా మాంసహారులు ఎక్కువ అవ్వటం వలన ఈ హద్దులు లేకుండా ఆన్నీ ఒక చోటే వడ్డిస్తున్నారు. మిలిటరీ హోటల్లో మిలిటరీ సంబంధించి ఏమీ వుండేది కాదు. అప్ప‌ట్లో కేవ‌లం మాంసాహారం తినే వారి కోస‌మే ఇలా మిలిట‌రీ హోట‌ల్ అని పేరు వ‌చ్చింది. అంతే కానీ, మిలిట‌రీ హోట‌ల్‌, సాధార‌ణ హోట‌ల్ ఇప్పుడు రెండూ ఒక‌టే అని చెప్ప‌వ‌చ్చు. రెండింటికీ పెద్ద తేడా లేదు.

Admin