information

పేద‌లు అంద‌రికీ డ‌బ్బు ప్రింట్ చేసి ఇవ్వ‌వ‌చ్చు క‌దా.. అలా ఎందుకు చేయ‌రు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">డబ్బు ప్రభుత్వం తాయారుచేస్తుంది అంటే R&period;B&period;I అలాంటపుడు మనదేశంలో చాల మంది పేద ప్రజలు ఉన్నారు&period; డబ్బులు ఎక్కువ ముద్రించి పేద ప్రజలకు ఎందుకు ఇవ్వరు&comma; ఎక్కువ డబ్బులు ఎందుకు ముద్రించ‌రు&comma; ముద్రిస్తే సమస్యలు ఏంటి&period;&period;&quest; ఈ ప్రశ్నకు డైరెక్టుగా సంబంధం లేక పోవచ్చు గానీ… గుర్తు చేసుకోవడం అసందర్భం కాదు&excl; కరెక్ట్ గా ఇదే సందేహం అయిదేళ్లు ఏపీ కి సీఎంగా పని చేసిన జ‌గన్ రెడ్డికి కూడా ఒక దశలో వచ్చింది&comma; డబ్బుని కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంద‌ని అనుకున్నారేమో తెలియదు&excl; పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించి&comma; వారికి పునరావాస కాలనీలు నిర్మించాలంటే ఇరవై వేల కోట్లు అవసర మవుతాయని&comma; అంత ధనం తనవద్ద లేదని&comma; రాష్ట్రానికి అంత శక్తి లేదనీ&comma; కేంద్రమే సాయ పడాలని చెప్పారు&comma; వారి కంట్రోల్లో ఉన్న రిజర్వ్ బ్యాంకు మనకు అంత కరెన్సీ ముద్రించి పంపితే నేరుగా మీ ఖాతాల్లో జమ చేస్తానని ఉదారంగా ప్రకటించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్నేళ్ళు గడిచినా తమకు పరిహారం రావడం లేదని విసిగిపోయి ఆవేదనగా చెప్పిన నిర్వాసితులతో జగన్ రెడ్డి అప్పటికి సముదాయింపుగా &comma; వారికి అర్థమయ్యే శైలిలో అని ఉండవచ్చు&period; నిజమే…&period; జగన్ రెడ్డి చెప్పినది అక్షరాలా నిజం&comma; అయితే అలా నోట్ల కట్టలు అచ్చు వేసి ఎలా బడితే అలా పంపడమే కుదరదు&comma; కారణం ఏమంటే…కరెన్సీ ముద్రించడం తేలికే&comma; కానీ సదరు కరెన్సీ కి తగిన విలువ తేవడమే కష్టం&comma; కాగితం కరెన్సీ అనగానే అది వట్టి పేపరేగా&quest; ఏం పోయింది&excl; అనుకోరాదు&comma; దానికి చాలా లెక్కలు ఉంటాయి&period; ఏ వస్తువు కైనా మనం దానికున్న విలువ మేరకు డబ్బు చెల్లించి కొనుగోలు చేస్తున్నాము అంటే అర్ధం&comma; దానికి ఆ నిజ విలువ ఉండబట్టే&comma; దానికి వాస్తవంగా ఆ విలువ ఉందని రిజర్వు బ్యాంకు వారు మనకు కరెన్సీ నోటుపై బ్యాంకు గవర్నర్ సంతకంతో కూడిన హామీ ఇస్తుంటారు&period; అది ఆరు నూరైనా ఆ నోటుకు ఆ విలువ కి గ్యారంటీ ఇవ్వడమన్న మాట&excl; సదరు కరెన్సీ కి సమానమైన వస్తువుని గానీ లేదా బంగారం గానీ మీకు ఇస్తామని&comma; అది చెల్లుబాటు కాకపోవడం అంటూ ఉండదని వారు హామీ పడతారని అర్దం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89081 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;money-1-1&period;jpg" alt&equals;"why can not we print money and give it to poor people " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కరెన్సీకి విలువ విషయానికి వస్తే…దేశంలో ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తి అయ్యే పంటలు&comma; పారిశ్రామిక వస్తు సముదాయం&lpar; దీన్నే స్థూల జాతీయోత్పత్తి అంటారు&rpar;&comma; ఎగుమతులు&comma; రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న బంగారం నిల్వలు&comma; విదేశీ మారకపు నిల్వలు&comma; ముఖ్యంగా ఏ దేశ మైనా అంగీకరించే డాలర్లు మొత్తాన్ని లెక్క కడతారు&period; ఆ మేరకు కరెన్సీ ఎంత ముద్రించాలో లెక్కలు వేస్తారు&comma; వాటి విలువని ఒక్క చోట చేర్చి మదింపు చేస్తారు &comma; అదే మొత్తాన్ని వివిధ రూపాయల విలువలతో ప్రింట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తారు&period; అప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ లోకి సదరు కరెన్సీ వచ్చి చేరుతుంది&comma; అక్కడికి రిజర్వ్ బ్యాంకు పని ముగిసినట్టే&comma; ఇది నిరంతర ప్రక్రియ…ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల యుగం వచ్చింది&comma; భౌతికంగా కరెన్సీ నోట్లు ఇవ్వం&comma; కేవలం సెల్ ఫోన్ పై వేళ్ళు ఆడించి డబ్బు బదిలీ చేస్తాం&comma; ఒక విధంగా రిజర్వు బ్యాంకు చేసే పనినే మనం చేస్తున్నాము&comma; ఇది కూడ కరెన్సీ ప్రింటు చేయడం లాంటిదే అనుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవల ఆఫ్రికా లో బడుగు దేశమైన జింబాబ్వే ఆర్థికంగా దివాలా తీసింది&comma; ఆ దేశంలో ఒక కప్పు చాయ్ తాగాలంటే &comma; ఒక బ్రెడ్ కొని తినాలంటే అర చేతిలోకి పట్టే కరెన్సీ కట్ట ఇవ్వాలి&comma; దేశంలో ఎక్కడ చూసినా నగదు నోట్లు గుట్టలు గుట్టలుగా పడి కనిపించాయి&comma; వాటికి ఏ విలువా లేదు&comma; దాన్ని ఏ దేశమూ గుర్తించి తీసుకోదు&period; తల కింద దిండ్లుగా చేసుకుని పడుకోవచ్చు&comma; దొంగల భయం కూడా అక్కర్లేదు&period;&period; తమ వద్ద డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నామని&comma; చేత కాని ప్రభుత్వం కనీసం దాన్ని కూడా సమకూర్చ లేక పోతోందని జనం గగ్గోలు పెట్టగా రేయింబవళ్ళు ప్రింటింగ్ మిషన్లు నడిపి ప్రజల కోర్కె తీర్చి వద్దంటే డబ్బు అన్నట్టు పంచారు&excl; అలా ఉంటుంది జబ్బున పడిన ఆర్థిక వ్యవస్థ తీరు&comma; కనీసం ప్రింటు చేసిన ఖర్చులు కూడా రావు&comma; భారత్ లాంటి సువిశాల వనరులు&comma; మేధస్సు&comma; కష్టించే ప్రజలు ఉన్న దేశానికి ఆ దుస్థితి ఎన్న టికీ రాదు&period; మన రూపాయి బక్క చిక్కి విలువ కోల్పోయే ప్రశ్నే లేదు&comma; డాలర్ మారకపు విలువతో పోల్చుకుంటే ఒడిదుడుకులు కనిపించవచ్చు&comma; అంత మాత్రాన రూపాయి విలువ పూర్తిగా దిగజారినట్టు దిగులు పడరాదు &comma; మనం నిశ్చింతగా ఉండవచ్చు&comma; అదే ఇండియన్ కరెన్సీ గొప్పతనం&period; మన ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ప్రపంచ టాప్ 5 లో ఒక వ్యవస్థగా ఎదిగింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts