inspiration

గొప్ప యూనివ‌ర్సిటీలో చ‌ద‌వ‌లేదు.. అయినా గూగుల్‌లో జాబ్ సాధించాడు..!

ఐటీ హబ్ లో ఉద్యోగం చేయలని ప్రతిఒక్కరూ ఎన్నో క‌ల‌లు కంటారు. ఇందుకోసం ఇంజ‌నీరింగ్ చదివి ఆ ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే ఈరోజుల్లో ఐటీ ఉద్యోగాల్లో జాబ్‌ సంపాదించాలంటే చాలా కష్టంగా మారింది. అసలే ఓ వైపు ఐటీ సంస్థల్లో ఉద్యోగుల కోతలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో డ్రీమ్‌ జాబ్‌, అది కూడా గూగుల్‌ కంపెనీలో అంటే ఒక క‌లే అని చెప్పాలి. అయితే ఓ యువ‌కుడు త‌న ఆశ‌యం, ప‌డిన క‌ష్టానికి ప్ర‌తిఫ‌లంగా గూగుల్‌లో జాబ్ సంపాదించాడు.అభిషేక్ లండన్‌లో గూగుల్‌తో కలిసి పని చేస్తాడు. ఐదు దశల ఇంటర్వ్యూల తర్వాత అభిషేక్‌కి గూగుల్ ఈ ఆఫర్ ఇచ్చింది. చదువుకుంటున్న సమయంలోనే అభిషేక్‌కి గూగుల్‌లో పనిచేయాలనే కోరిక కలిగింది. ఇప్పుడు అతడి కల నెరవేరింది. గూగుల్ అతడికి రూ.2 కోట్ల 7 లక్షల ప్యాకేజీ ఇచ్చి నియమించుకుంది.

అక్టోబర్‌ నెలలో అభిషేక్ ఉద్యోగంలో చేరనున్నాడు. బీహార్‌లోని జముయి జిల్లాలోని జము ఖరియా అనే మారుమూల గ్రామానికి చెందిన కంప్యూటర్ ఇంజనీర్ అయిన అభిషేక్ కుమార్ పాట్నాలోని ఎన్‌ఐటీలో బీటెక్‌ చేశాడు. ఇది అభిషేక్ కెరీర్‌లో ఒక పెద్ద విజయం చెప్పుకొవచ్చు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన అభిషేక్‌ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలో భారీ ప్యాకేజీతో జాబ్ సాధించడం నిజంగా గొప్ప విషయం. అభిషేక్ తండ్రి ఇంద్రదేవ్ యాదవ్ జాముయి సివిల్ కోర్టులో న్యాయవాది కాగా, అతని తల్లి మంజు దేవి గృహిణి. మొదటి నుంచి చదువులో ప్రతిభకనబరిచే అభిషేక్‌.. ఎందరో కలలుకనే డ్రీమ్‌ జాబ్‌ అయిన గూగుల్‌లో కొలువు దక్కించుకున్నాడు.

abhishek from bihar got job at google without studying in corporate university

డెడికేషన్, హార్డ్ వర్క్ ఉంటేనే ఈ తరహా విజయాన్ని అందుకోవచ్చని అభిషేక్ అంటున్నాడు. ఈ రంగంలో మరింత ముందుకు సాగాలన్నారు. ఈ రంగంలో ఉంటూ సమాజానికి దోహదపడాలన్నారు. ప్రతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గూగుల్‌తో కలిసి పనిచేయాలని కలలు కంటారు, ఇక్కడ మరింత మెరుగ్గా పని చేయడానికి ఒక మంచి వాతావరణాన్ని పొందుతారు. ఈ విజయానికి సంబంధించిన క్రెడిట్‌ను అభిషేక్ తన తల్లిదండ్రులకు ఇచ్చాడు. తన డ్రీమ్‌ జాబ్‌ అయిన గూగుల్‌ లో రూ.2.07 కోట్లతో ఉద్యోగం సాధించి తల్లిదండ్రులు గర్వపడేలా చేశాడు. 2022లో అమెజాన్‌లో రూ. 1.08 కోట్ల ప్యాకేజీతో సాధించాడు. ఇలా అక్కడ నుంచి 2023 మార్చి వరకు పనిచేశాడు. ఆ తర్వాత, జర్మన్ పెట్టుబడి సంస్థ విదేశీ మారకపు ట్రేడింగ్ యూనిట్‌లో చేరాడు. అయిన‌ప్ప‌టికీ మళ్లీ రెట్టింపు కృషి చేసి కష్టపడ్డాడు. ఈ నేపథ్యంలోనే అభిషేక్‌ కు గూగుల్‌లో ఏడాదికి రూ. 2.07కోట్ల జీతంతో ఉద్యోగం వచ్చింది.

Share
Sam

Recent Posts