Aloe Vera : కలబంద గురించి ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే.!

Aloe Vera : కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందుకనే కలబందను అనేక వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగిస్తుంటారు. ఆయుర్వేదంలో దీనికి ఎంతగానో ప్రాధాన్యత ఉంది. పలు ఔషధాల తయారీలో కలబందను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే కలబంద గురించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

interesting facts about Aloe Vera

1. కలబంద జన్మస్థలం ఆఫ్రికా. ఇది వేడి వాతావరణంలో పెరుగుతుంది. ఆఫ్రికాతోపాటు మన దేశంలోనూ ఇది ఎక్కువగా పెరుగుతుంది.

2. కలబంద మొక్క ఆకులను చీలిస్తే లోపల తెల్లని గుజ్జు ఉంటుంది. దీన్ని అనేక రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అనేక వ్యాధులను నయం చేసేందుకు దీన్ని ఉపయోగించవచ్చు. ఆ గుజ్జులో దాదాపుగా 99 శాతం నీరే ఉంటుంది. అందువల్ల కలబంద గుజ్జు పూర్తిగా ఆరోగ్యకరమైందని చెప్పవచ్చు. కొందరు దీన్ని తీసుకునేందుకు భయపడుతుంటారు. కానీ అది పూర్తిగా సురక్షితమే. ఎలాంటి భయం చెందాల్సిన పనిలేదు.

3. కలబందను లిల్లీ ఆఫ్‌ ది డిజర్ట్‌ అని ముద్దుగా కొన్ని ప్రాంతాల్లో పిలుచుకుంటారు.

4. పురాతన ఈజిప్టు రాణి క్లియోపాత్రా గురించి అందరికీ తెలిసిందే. ఆమె క్రీస్తు పూర్వం 1550 లలో ఒక వెలుగు వెలిగింది. అయితే ఆమె అందానికి అప్పట్లో రాజులు ముగ్దులయ్యేవారు. అందుకనే ఆమెను సొంతం చేసుకోవాలని అనుకునేవారు. అయితే మీకు తెలుసా ? క్లియోపాత్రా తన చర్మ సౌందర్యం కోసం కలబందను ఎక్కువగా ఉపయోగించేదట. కలబంద గుజ్జును తన శరీరం మొత్తం రాసుకుని స్నానం చేసేదట. దీంతో ఆమె అందంగా తయారైందని చెబుతారు.

5. మనకు బయట కనిపించే కలబంద ఒకేలా ఉంటుంది. కానీ ప్రపంచం మొత్తం మీద దాదాపుగా 4000 జాతులకు పైగా కలబంద మొక్కలు ఉన్నాయి. అయితే అన్నీ ఔషధాలకు పనికిరావు. కొన్ని కేవలం 1 ఇంచు సైజులోనే ఉంటాయి. కొన్ని పెద్దగా చెట్లుగా పెరుగుతాయి. అవి 50 అడుగుల వరకు పొడవు ఉంటాయి.

6. కలబంద మొక్కలు పువ్వులు పూస్తాయి. అవి తెలుపు, పసుపు, నారింజ, ఎరుపు రంగుల్లో ఉంటాయి.

7. పురాతన గ్రీకులు కలబందను ఔషధంగా ఉపయోగించేవారు. కలబంద గుజ్జును వారు బట్టతలకు ఔషధంగా వాడేవారట.

8. జపాన్‌ వాసులు ఎంత అందంగా ఉంటారో తెలుసు కదా. అయితే వారు పెరుగులో కలబంద గుజ్జును కలిపి తింటారట. అందుకనే వారు అంత అందంగా ఉంటారట.

9. ఒక కలబంద మొక్క పూర్తి స్థాయిలో పెరిగేందుకు సుమారుగా 3 నుంచి 4 ఏళ్ల సమయం పడుతుంది. 30 ఇంచుల వరకు పెరుగుతుంది. ఒక్కో మొక్కకు సుమారుగా 21 ఆకుల వరకు వస్తాయి.

 

10. కలబందను ఇంగ్లిష్‌లో అలొవెరా (Aloe Vera) అంటారు. అలొ అంటే అరబిక్‌లో కాంతిగా ఉన్న చేదు పదార్థం అని అర్థం వస్తుంది. అదే వెరా అనే పదానికి లాటిన్‌లో నిజం అనే అర్థం వస్తుంది. కలబంద గుజ్జు పూర్తిగా తయారవకపోతే కొంచెం చేదుగా అనిపిస్తుంది. పూర్తిగా తయారైతే రుచిగా ఉండదు. చప్పగా ఉంటుంది.

11. కలబంద గుజ్జును రోజూ 30 ఎంఎల్‌ మోతాదులో తీసుకుంటే శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీన్ని శాస్త్రీయంగా రుజువు చేశారు కూడా.

12. కలబంద మొక్కకు సుమారుగా 4000 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు.

కలబంద మొక్క గుజ్జు ఆరోగ్యకరమే అయినా దీన్ని గర్భిణీలు, 12 ఏళ్ల వయస్సు లోపు వారు ఉపయోగించరాదు. అలాగే దీన్ని వాడినా, తీసుకున్నా.. కొందరికి చర్మంపై దద్దుర్లు వస్తాయి. అలాంటి వారు కూడా కలబందను ఉపయోగించరాదు.

ఇక కలబందను అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. దీన్ని రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్‌ మోతాదులో తీసుకుంటే గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉంటాయి.

పురుగులు కుట్టిన చోట, గాయాలు, పుండ్లు అయిన చోట కలబంద గుజ్జును రాస్తే ఫలితం ఉంటుంది. ముఖానికి కలబంద గుజ్జు రాసి కొంత సేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. అలాగే జుట్టుకు రాసి తలస్నానం చేస్తుంటే జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా మారుతుంది. జుట్టు సమస్యలు పోతాయి.

క‌ల‌బంద మొక్క‌ల‌ను మ‌నం ఇంట్లోనే సుల‌భంగా కుండీల్లో పెంచుకోవ‌చ్చు. వీటికి పెద్ద‌గా నీరు కూడా అవ‌స‌రం ఉండదు. పైగా మ‌న‌కు ఎప్పుడంటే అప్పుడు స‌హ‌జ‌సిద్ధ‌మైన తాజా క‌ల‌బంద గుజ్జు ల‌భిస్తుంది.

Admin

Recent Posts