lifestyle

షాపింగ్‌ అతిగా చేస్తున్నారా.. ఈ లక్షణాలు ఉంటే మీకు ఆ వ్యాధి ఉన్నట్లే..!

షాపింగ్‌ చేయడం అంటే మహిళలకు చాలా ఇష్టం. షాపింగ్‌ అంటే చాలు… ఎక్కడ లేని ఉత్సాహం అంతా బయటకు వస్తుంది. అయితే ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఎవరికైనా సరే షాపింగ్‌ ఒక ఔషధం మాదిరిగా పనిచేస్తుందని సైంటిస్టులు గతంలోనే చెప్పారు. కానీ షాపింగ్‌ చేయడం మంచిదే కదా, ఒత్తిడి తగ్గుతుంది కదా.. అని చెప్పి అదే పనిగా షాపింగ్‌ చేయరాదు. దీంతో ప్రయోజనాలు కలగకపోగా నష్టాలే కలుగుతాయి. అతి షాపింగ్‌ వల్ల ఆర్థిక సమస్యలే కాదు, మానసిక సమస్యలు కూడా వస్తాయి.

అతిగా షాపింగ్‌ చేయడాన్ని కంపల్సివ్‌ బయింగ్‌ డిజార్డర్‌ (సీబీడీ) అని పిలుస్తారు. అంటే వీరు షాపింగ్‌ చేయకుండా ఉండలేరన్నమాట. అయితే ఆ వ్యాధి బారిన పడిన వారిలో పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే…

1. అవసరం ఉన్నా, లేకపోయినా అతిగా వస్తువులను కొంటుంటారు. పదే పదే షాపింగ్‌ చేస్తారు. ఇంట్లోకి, శరీరానికి, ఇతర అవసరాలకు పనికిరాకపోయినా వస్తువులను అదే పనిగా కొంటుంటారు.

2. ఆర్థిక సమస్యలు ఉన్నా, ఇంటి నుంచి అయినా, బయట అయినా, ఇతరులతో కలిసి అయినా సరే షాపింగ్‌ చేస్తారు.

3. ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి కొనాలని ఆలోచిస్తుంటారు. ఆ దిశగా సమయాన్ని వృథా చేస్తుంటారు. ఏదైనా కొనాలని ఎక్కువగా ఆన్‌లైన్‌లో వెదుకుతారు. అది అవసరం లేకపోయినా సరే దాన్ని కొనాలని దాని గురించి ఆన్‌లైన్‌లో వెదుకుతుంటారు.

check here to see if you are doing over shopping or what

4. అమెరికాకు చెందిన హెల్త్‌ వెబ్‌సైట్‌ వెబ్‌ ఎండీ చెబుతున్న ప్రకారం నెగెటివ్‌ ఎమోషన్స్‌ ఉన్నవారు కూడా తరచూ షాపింగ్‌ చేస్తారని వెల్లడైంది.

5. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఇతర ఏ పనిచేస్తున్నా.. షాపింగ్‌ గురించే ఆలోచిస్తుంటారు. అలాగే ఏ అంశం మీదకు మనస్సు మారినా చివరకు షాపింగ్‌ వద్దకే మనస్సు డైవర్ట్‌ అవుతుంది. ఈ లక్షణాలు ఉన్నవారు కూడా షాపింగ్‌కు అడిక్ట్‌ అయినట్లు భావించాలి.

6. ఏం కొనాలో తెలియకపోయినా కొందరు ఎప్పుడూ ఏదో ఒక వస్తువు కొంటారు. ఈ లక్షణం కనిపించినా పైన తెలిపిన వ్యాధితో బాధపడుతున్నట్లే అర్థం చేసుకోవాలి.

7. అప్పు చేసి షాపింగ్‌ చేయడం, అవసరానికి మించి మరీ అప్పులు చేసి వస్తువులను కొనడం, వస్తువులను కొనడం కోసం ఇతరుల వద్ద ఆదాయానికి మించి అప్పులు చేయడం.. వంటివన్నీ షాపింగ్‌ డిజార్డర్‌ కిందకే వస్తాయి.

8. కొందరికి షాపింగ్‌ చేసినప్పుడు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మైండ్‌ ఫ్రెష్‌ అయినట్లు భావిస్తారు. అయితే కొందరికి మాత్రం షాపింగ్‌ చేయనిదే నిద్ర పట్టదు. ఇలాంటి లక్షణం కనుక ఉంటే దాన్ని తప్పనిసరిగా కంపల్సివ్‌ బయింగ్‌ డిజార్డర్‌ గా భావించాలి. వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. షాపింగ్‌ అనే ఆలోచన వచ్చినప్పుడల్లా మనస్సును ఇతర అంశాల మీదకు మళ్లించాలి.

Admin

Recent Posts