technology

మొబైల్ ఫోన్ బ్యాట‌రీల‌ను ఎలా చార్జ్ చేయాలి ?

స్మార్ట్ ఫోన్లు వాడ‌డంతోనే కాదు, అవి ఎక్కువ కాలం ఎలాంటి స‌మ‌స్యా లేకుండా ప‌నిచేయాలంటే వాటిని స‌రిగ్గా ఉప‌యోగించాలి. ముఖ్యంగా ఫోన్ల‌లో బ్యాట‌రీ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి క‌నుక బ్యాట‌రీ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఫోన్‌కు స‌రైన స‌మయంలో చార్జింగ్ పెట్టాలి. ఈ క్ర‌మంలోనే ఫోన్ల‌ను ఎలా చార్జింగ్ చేయాలి, చార్జింగ్ విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి ? అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

* స్మార్ట్ ఫోన్ల‌కు కొంద‌రు పూర్తిగా చార్జింగ్ అయిపోయే వ‌ర‌కు ప‌ట్టించుకోరు. చార్జింగ్ మొత్తం అయిపోయి స్విచాఫ్ అయ్యాక చార్జింగ్ పెడ‌తారు. అలా చేయ‌రాదు. చేస్తే బ్యాట‌రీ లైఫ్ త‌గ్గుతుంది. క‌నుక బ్యాట‌రీ క‌నీసం 20 శాతానికి రాగానే చార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. అయితే చార్జ‌ర్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది, ఎక్క‌డైనా చార్జింగ్ పెట్టుకునే వీలు ఉంటుంది అనుకునే వారు బ్యాట‌రీ 40-50 శాతం ఉండ‌గా చార్జింగ్ పెట్టుకుంటే మంచిది. ఇక చార్జ‌ర్ అందుబాటులో లేని వారు 20 శాతం ఉన్న‌ప్పుడు చార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. దీంతో బ్యాట‌రీ లైఫ్ ఎక్కువ కాలం వ‌స్తుంది.

* ఫోన్ల‌కు కొంద‌రు ఏ చార్జ‌ర్‌ను ప‌డితే దాన్ని చార్జింగ్ కోసం వాడుతారు. అలా చేయ‌రాదు. కంపెనీ అందించే చార్జ‌ర్ నే వాడాలి. ఆ చార్జ‌ర్ అందుబాటులో లేక‌పోతేనే వేరే చార్జ‌ర్‌ను వాడాలి. కంపెనీ అందించే చార్జ‌ర్‌ను వాడ‌డం వ‌ల్ల ఫోన్ బ్యాట‌రీ ఎక్కువ కాలం మ‌న్నుతుంది.

how to charge mobile phone battery

* ఎండలో ఉంచిన కారులో ఫోన్‌ను అలాగే పెట్ట‌రాదు. అలాగే మెడిక‌ల్ డివైస్ ల ద‌గ్గ‌ర‌, టీవీల ద‌గ్గ‌ర‌, అయ‌స్కాంత క్షేత్రాలు ఉండే చోట‌, మైక్రోవేవ్ ఓవెన్ ల వ‌ద్ద ఫోన్ల‌ను ఉంచ‌రాదు. ఉంచితే బ్యాట‌రీపై ప్ర‌భావం ప‌డుతుంది.

* కొంద‌రి ద‌గ్గ‌ర ఫోన్లు ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో వారు వాటిని ఇంట్లో అలాగే ప‌డేస్తారు. అయితే వాటికి కూడా చార్జింగ్ పెట్టాలి. చార్జింగ్ చేయ‌క‌పోతే నెల‌కు 5 నుంచి 10 శాతం చొప్పున వాటి లైఫ్ త‌గ్గుతుంది. దీంతో కొద్ది నెల‌ల‌కు బ్యాట‌రీ డెడ్ అవుతుంది. దీంతో ఫోన్ ప‌నికిరాకుండా పోతుంది. కొత్త బ్యాట‌రీ వేయాల్సి వ‌స్తుంది. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే వాడ‌ని ఫోన్ల‌కు కూడా అప్పుడ‌ప్పుడు చార్జింగ్ పెడుతుండాలి.

Admin

Recent Posts