Tooth Pick : సాధారణంగా మనం చికెన్, మటన్ వంటి మాంసాహారాలతోపాటు ఏవైనా పీచు పదార్థాలు కలిగిన శాకాహారాలను, గింజలను, విత్తనాలను వంటి వాటిని తిన్నప్పుడు మనకు సహజంగానే కొందరిలో దంతాల్లో అవి ఇరుక్కుపోతుంటాయి. మనం తినే ఆహారాలు చిన్న చిన్న ముక్కలు లేదా పీచులుగా మారి దంతాల సందుల్లో చిక్కుకుంటాయి. దీంతో వాటిని తీసేందుకు చాలా మంది అష్టకష్టాలు పడుతుంటారు. అందుకు గాను టూత్ పిక్‌లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒక రకానికి చెందిన వాటిని ప్లాస్టిక్‌తో చేస్తారు. ఇంకో రకానికి చెందిన వాటిని చెక్కతో తయారు చేస్తారు.
అయితే చెక్క టూత్ పిక్స్ సులభంగా విరిగిపోతాయి. కానీ ధర తక్కువ. ఇక ప్లాస్టిక్ టూత్ పిక్స్ విరిగిపోవు. వీటి ధర ఎక్కువగా ఉంటుంది. అందులో భాగంగానే ఎవరైనా సరే తమ స్థోమత, సౌకర్యానికి అనుగుణంగా టూత్ పిక్‌లను కొని వాడుతుంటారు. అలాగే హోటల్స్ లేదా రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు మనకు చివర్లో బిల్ ఇచ్చే సమయంలో సోంపు గింజలతోపాటు టూత్ పిక్స్‌ను కూడా ఇస్తుంటారు. అయితే టూత్ పిక్స్‌ను మనం చాలా సార్లు వాడాం. కానీ వాటిని సరిగ్గా గమనించలేదు. వాటి ద్వారా మనం ఒక విషయాన్ని తెలుసుకోవచ్చు. అదేమిటంటే..
టూత్‌పిక్ కింది భాగంలో చాలా పదునుగా ఉంటుంది. దీంతో ఆ భాగం దంతాల సందుల్లోకి సులభంగా చేరుతుంది. ఫలితంగా ఆ సందుల్లో ఇరుక్కున్న ఆహారాలను మనం సులభంగా టూత్ పిక్‌లతో బయటకు తీయగలుగుతాం. ఇక టూత్ పిక్ పైభాగంలో చెక్కినట్లు ఉంటుంది. దాన్ని అలా ఎందుకు ఏర్పాటు చేశారంటే.. కింద ఇచ్చిన చిత్రంలో చూశారు కదా.. పైభాగాన్ని కొంత మేర విరిచి టేబుల్ మీద పెడితే దానిపై టూత్ పిక్‌ను ఉంచవచ్చు. దీంతో టూత్ పిక్‌ను టేబుల్ మీద నేరుగా పెట్టాల్సిన పని ఉండదు. టూత్ పిక్ టేబుల్‌కు అంటదు. ఫలితంగా దాన్ని మళ్లీ మనం ఉపయోగించుకోవచ్చు. అందుకోసమే టూత్ పిక్ ఫైబాగంలో అలాంటి అమరిక ఉంటుంది. కనుక ఈసారి టూత్‌పిక్‌ను ఉపయోగిస్తే దాని పైభాగంలో ఉండే అమరికను కూడా ఉపయోగించుకోండి. సులభంగా ఉంటుంది.