మన మనుగడకు ఆక్సిజన్ ( oxygen ) చాలా ముఖ్యం. దీనిని మనం చెట్ల నుండి పొందుతాము. ఈ భూమి మీద అనేక రకాల చెట్లు ఉన్నాయి.. అవి ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తాయి. చాలా మంది వేప చెట్టు అన్నింటికన్నా ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుందని అనుకుంటారు. మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారా? అయితే, ఇక్కడ 99 శాతం మందికి తెలియని నిజం గురించి ఇక్కడ తెలుసుకుందాం.. హిందూమతంలో రావి చెట్టుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది ఎక్కువ ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తుంది. బౌద్ధమతంలో ఈ చెట్టును బోధి అని పిలుస్తారు. బుద్ధుడు ఈ చెట్టు క్రింద జ్ఞానోదయం పొందాడని చరిత్ర చెబుతుంది. ఇది పగలే కాకుండా రాత్రిపూట కూడా ఆక్సిజన్ ను రిలీజ్ చేస్తుంది. అందుకే, ఈ చెట్టు ముఖ్యమైనదిగా చెబుతారు.
పల్లెటూర్లలో వేప చెట్టు బాగా కనిపిస్తుంది. ఇది అత్యధికంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసే చెట్లలో ఒకటిగా పేరుగాంచింది. దీనికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వేప చెట్టు గాలి నుండి కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ వంటి కలుషిత వాయువులను గ్రహిస్తాయి. పర్యావరణంలోకి ఆక్సిజన్ పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. ఎండాకాలంలో వేప చెట్టు ఇచ్చే చల్లదనం ఇంకేది ఇవ్వదు. భారత దేశంలో మర్రి చెట్లు చాలా ఉంటాయి. ఈ చెట్టు భారతదేశ జాతీయ వృక్షం. ఇది ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ చెట్టు నీడ కూడా పెద్దగా ఉంటుంది. ఇప్పటికి ఎంతో మంది మధ్యాహ్న సమయంలో భోజనం చేస్తుంటారు.
హిందూమతంలో తులసి చెట్లుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తమ ఇళ్లల్లో తులసి మొక్కను ఉంచుతారు. తులసి చెట్టు చిన్నది అయినప్పటికీ, ఇది ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఇంట్లో నాటడం వలన నెగటివ్ ఎనర్జీ పోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.