lifestyle

Life Tips : ఈ 6 ప‌నుల‌ను ఎక్కువ‌గా చేస్తే.. అది మ‌ర‌ణానికి సంకేత‌మే..?

Life Tips : అష్టాద‌శ మ‌హా పురాణాల్లో గ‌రుడ పురాణం కూడా ఒక‌టి. శ్రీ మ‌హా విష్ణువు తానే స్వ‌యంగా ఈ పురాణంలోని అన్ని విష‌యాల‌ను గ‌రుత్మంతుడికి వివ‌రించారు. జీవితాన్ని స‌రిగ్గా జీవించే విధానం, నియ‌మాల‌ను ఇందులో వివ‌రించారు. గ‌రుడ పురాణంలో మ‌నిషి చేయ‌కూడని ప‌నుల గురించి, అలాగే ఏ ప‌నులు చేయ‌డం వ‌ల్ల మ‌నిషి ఆయుష్షు త‌గ్గిపోతుందో అని కూడా ఇందులో వివ‌రించారు. గ‌రుడ పురాణం ప్ర‌కారం మ‌నిషి చేయ‌కూడని ప‌నులు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ మ‌నం బ్ర‌హ్మ ముహుర్తంలోనే నిద్ర లేవాలి. ఉద‌యం ఆల‌స్యంగా నిద్ర లేచే వారు త‌మ జీవితాన్ని త‌గ్గించుకుంటారని బ్ర‌హ్మ ముహుర్తంలో ఉంది. బ్ర‌హ్మ ముహుర్తంలో స్వ‌చ్చ‌మైన గాలి ఉంటుంది. ఈ గాలి పీల్చ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. శ్వాస స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఆయుష్షు పెరుగుతుంది.

ఉద‌యం ఆల‌స్యంగా లేచే వారు మంచి గాలిని పీల్చుకోలేరు. దీంతో వారు అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డి త్వ‌ర‌గా మ‌ర‌ణిస్తారు. అలాగే మ‌నం రోజూ ఆహారంలో భాగంగా పెరుగును తీసుకుంటూ ఉంటాము. పెరుగు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే పెరుగును రాత్రి పూట తీసుకోవ‌డం మంచిది కాద‌ని గ‌రుడ పురాణం చెబుతుంది. రాత్రి పూట పెరుగు తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు వ్యాధులు పెరుగుతాయి. క‌డుపు వ్యాధులు పెర‌గ‌డం వ‌ల్ల అన్ని వ్యాధులు వ‌స్తాయి. దీంతో మ‌న ఆయుష్షు క్షీణిస్తుంది. క‌నుక రాత్రి పూట పెరుగును తీసుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ని గ‌రుడ పురాణం చెబుతుంది. అలాగే కొంత‌మంది మాంసాహారులు త‌రుచూ నిల్వ ఉంచిన మాంసాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. నిల్వ ఉంచిన మాంసాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మీరు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొన్ని తెచ్చుకున్న‌ట్టే అని గ‌రుడ పురాణం చెబుతుంది. నిల్వ ఉంచిన మాంసంలో ప్ర‌మాద‌క‌ర‌మైన బ్యాక్టీరియా పెరుగుతుంది. నిల్వ ఉంచిన మాంసాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఈ బ్యాక్టీరియా క‌డుపులోకి చేరి అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. క‌నుక నిల్వ ఉంచిన మాంసాన్ని తీసుకోకపోవ‌డ‌మే మంచిది.

doing these 6 works will reduce your life

అదే విధంగా జీవితంలో అనేక స‌మ‌స్య‌ల‌కు దారి తీసే స్త్రీ, పురుషుల‌కు శారీర‌క సంబంధాల‌పై నియంత్ర‌ణ ఉండాల‌ని గ‌రుడ పురాణం చెబుతుంది. ఉద‌యం పూట లైంగిక సంప‌ర్కం చేయ‌డం లేదా అధికంగా లైంగిక సంప‌ర్కం చేయ‌డం వంటివి పురుషుల జీవిత కాలాన్ని త‌గ్గిస్తాయి. పురుషుల శ‌రీరాన్ని ఇది బ‌ల‌హీన‌ప‌రుస్తుంది. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది. క‌నుక ఉద‌యం త్వ‌ర‌గా నిద్ర‌లేచి యోగా, ధ్యానం, ప్రాణాయామాలు చేయ‌డం అల‌వాటు చేసుకోవాలి. అలాగే స్మ‌శానంలో మృత‌దేహాన్ని కాల్చిన త‌రువాత దాని నుండి వ‌చ్చే పొగ‌లో అనేక ర‌కాల బ్యాక్టీరియా ఉంటుంది. ఇది గాలిలో క‌లిసి అక్క‌డ ఉండే వారిపై చేరే అవ‌కాశం ఉంటుంది. క‌నుక స్మ‌శాన‌వాటిక నుండి ఇంటికి రాగానే ధ‌రించిన బ‌ట్ట‌లు తీసేసి వాటిని ఉతికి ఆ త‌రువాత స్నానం చేయాలి. అలాగే మ‌నిషి శ‌రీరంలోకి రోగాలు ప్రవేశించ‌డానికి ముఖ్య‌మైన కార‌ణాల్లో అతిగా తిన‌డం, ధాతు క్షీణ‌త‌, మ‌ల‌మూత్ర‌విసర్జ‌న త్వ‌ర‌గా చేయ‌డం లేదా వాటిని ఆపుకోవ‌డం, ప‌గ‌టిపూట నిద్రించ‌డం వంటి వాటి వ‌ల్ల రోగాలు శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తాయి. క‌నుక పనుల‌ను చేయ‌డం మానేయాలి. ఈ విధంగా గ‌రుడ పురాణం మ‌నిషి చేయ‌కూడ‌ని ప‌నుల‌ను కూడా చాలా చ‌క్క‌గా వివ‌రించింది. క‌నుక ఈ ప‌నులు చేసే అల‌వాటు క‌నుక మీకు ఉంటే వెంట‌నే మానుకోవ‌డం మంచిది.

Admin

Recent Posts